అజిత్ పవార్ విమాన ప్రమాదంపై కేంద్రం సంచలన నిర్ణయం.. రంగంలోకి AAIB

by Malleboina Mahesh |   (  Updated:2026-01-28 08:54:29  IST  )

బారామతిలో ఈ రోజు ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

అజిత్ పవార్ విమాన ప్రమాదంపై కేంద్రం సంచలన నిర్ణయం.. రంగంలోకి AAIB
X

దిశ, వెబ్ డెస్క్: బారామతిలో ఈ రోజు ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Deputy CM Ajit Pawar) ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే డిప్యూటీ సీఎం మృతిపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ.. అత్యున్నత స్థాయి విచారణ (High-level investigation)కు ఆదేశించింది. దీంతో AAIB ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. ఈ మేరకు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రత్యేక నిపుణుల బృందం ఢిల్లీ నుంచి బయలుదేరి.. ఇప్పటికే బారామతి చేరుకుంది. అలాగే విమానం కుప్పకూలిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.

విమాన శకలాలను సేకరించడంతో పాటు, ప్రమాదం వెనుక ఏదైనా సాంకేతిక లోపం (Technical error) ఉందా లేదా వాతావరణ పరిస్థితులు కారణమా అనే కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ విచారణలో భాగంగా అధికారులు విమానానికి సంబంధించిన 'బ్లాక్ బాక్స్'ను స్వాధీనం చేసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పైలట్లు చివరి నిమిషంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) తో జరిపిన సంభాషణలు, రాడార్ డేటా, విమానం యొక్క మెయింటెనెన్స్ రికార్డులను కూడా బృందం విశ్లేషించనుంది. స్థానిక పోలీసుల సహాయంతో సాక్షుల స్టేట్‌మెంట్లను రికార్డ్ చేస్తున్న AAIB ఈ ప్రమాదంపై త్వరలోనే తన ప్రాథమిక నివేదికను పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు సమర్పించనుంది.

Next Story