- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేడారం జాతర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తుంది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మేడారం జాతర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

దిశ, మేడారం న్యూస్ నెట్‌వర్క్: మేడారం జాతర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఉదయం మహా జాతరలో పాల్గొన్న ఆయనకు సంప్రదాయ పద్ధతిలో అమ్మవార్లను దర్శించుకునే విధంగా అధికారులు, మంత్రి సీతక్క చర్యలు తీసుకున్నారు. సారలమ్మను దర్శించుకున్న తర్వాత మేడారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈసారి జాతరకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించిందన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రామప్పకు మొట్టమొదటి యునెస్కో గుర్తింపు వచ్చేలా మోడీ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నూతన కట్టడాలు చేపట్టడం హర్షించదగ్గ విషయం అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం తరపున అభినందిస్తున్నామని, ఇక్కడ ట్రైబల్ యూనివర్సిటీ వస్తే గిరిజన యువత అభివ్రుద్దికి మరింత దోహద పడతుందన్నాదని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
మేడారంకు జాతీయ హోదా కల్పించాలని మంత్రుల వినతి
మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రులకు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ వినతి పత్రం సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి నిర్ణయం తీసుకోవాలన్నారు.






