ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. పోలవరానికి రూ.3,300 కోట్లు

by Muthe.Rajitha |

పోలవరం ప్రాజెక్టు పనుల కోసం అదనంగా సుమారు రూ. 3,300 కోట్ల నిధులను మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. పోలవరానికి రూ.3,300 కోట్లు
X

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం ఏపీకి మరో గుడ్ న్యూస్ తెలిపింది. పోలవరం ప్రాజెక్టు పనుల కోసం అదనంగా సుమారు రూ. 3,300 కోట్ల నిధులను మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శితో రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు జరిపిన కీలక భేటీలో ఈ నిధుల మంజూరుపై సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రం ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ. 2,300 కోట్లను విడుదల చేసింది. తాజాగా విడుదల చేయనున్న నిధులతో ప్రాజెక్టు పనులకు కొత్త ఊపిరి పోయనుంది. ముఖ్యంగా 2026-27 కేంద్ర బడ్జెట్‌లో పోలవరం కోసం కేటాయించిన రూ. 3,320 కోట్లకు ఇది అదనపు బలం కానుంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తూ, జూన్ 2027 నాటికి ప్రాజెక్టును సంపూర్ణంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రధానంగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, ఎగువ, దిగువ కాపర్ డ్యామ్ పనులు, అలాగే ప్రధాన డ్యామ్ పనులను వేగవంతం చేయడానికి ఈ నిధులను వెచ్చించనున్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కావడంతో, దీని వ్యయాన్ని కేంద్రమే భరిస్తోంది. తాజా ఆర్థిక సహాయంతో గతంలో నిలిచిపోయిన పనులు పుంజుకోవడమే కాకుండా, నిర్వాసితుల పునరావాసం ప్రక్రియను కూడా వేగవంతం చేసే అవకాశం ఉంటుంది.

Next Story