- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికాతో ట్రేడ్ డీల్‌పై కేంద్రం వివరణ
అమెరికాతో ట్రేడ్ డీల్‌పై కేంద్రం వివరణ ఇచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాతో ట్రేడ్ డీల్(India-US Trade Deal)పై కేంద్రం వివరణ ఇచ్చింది. ఈ మేరకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్(Piyush Goyal) పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. ‘అమెరికాతో చారిత్రాత్మక వాణిజ్యం ఒప్పందం కుదిరింది. ఈ డీల్‌తో భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టం కాబోతోంది. ఈ ట్రేడ్ డీల్‌పై ఎవరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మొద్దు. కావాలనే కుట్రపూరితంగా ట్రేడ్ డీల్‌పై రాహుల్ గాంధీ విషం చిమ్ముతున్నారు. దీనిని ప్రజలంతా గమనించాలి’ అని పీయూష్ గోయల్ ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా, ఈ వాణిజ్య ఒప్పందంతో దీంతో ఇకపై భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై సుంకాలను 18 శాతానికి తగ్గాయి. దీనికి కారణం భారత్‌లోని అమెరికా రాయబారిగా పని చేస్తున్న సెర్గియో గోర్ అని తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో అధికారికంగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఇరుదేశాల (India-US) మధ్య ద్వైపాక్షిక, వాణిజ్య బంధాన్ని మరోస్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేసినట్లు సమాచారం. కొంతకాలం క్రితం ట్రంప్ టారిఫ్‌లు, ఆయన చేసిన ప్రకటనలు రెండు దేశాల సంబంధాల్లో ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించాయి. ఈ నేపథ్యంలో ఆయన చొరవ తీసుకుని.. రెండు దేశాల మధ్య సయోధ్య కుదిర్చినట్లు తెలుస్తోంది.






