- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HPV వ్యాక్సిన్‌పై అసత్య ప్రచారాలు నమ్మకండి.. 100% రక్షణ కల్పిస్తుందని స్పష్టం చేసిన కేంద్రం!
HPV వ్యాక్సిన్ సురక్షితమని, గర్భాశయ క్యాన్సర్ నుండి సంపూర్ణ రక్షణ కల్పిస్తుందని కేంద్రం వివరణ. 2006 నుండే అందుబాటులో ఉన్న ఈ టీకాపై తప్పుడు వార్తలను నమ్మవద్దని వెల్లడి.

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇటీవల ఉచిత HPV వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. కాగా ఈ ఉచిత HPV వ్యాక్సినేషన్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. వాటిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ టీకా కొత్తదేమీ కాదని, 2006 నుంచి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉందని అధికారికంగా స్పష్టం చేసింది. 2022 చివరి నాటికే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 50 కోట్ల డోసుల పంపిణీ జరిగిందని, ఇది పూర్తిగా సురక్షితమని అనేక అంతర్జాతీయ అధ్యయనాలు ఇప్పటికే తేల్చిచెప్పాయని కేంద్రం వెల్లడించింది.
గర్భాశయ క్యాన్సర్ నివారణలో కీలకం
ఈ వ్యాక్సిన్ ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్ (Cervical Cancer) నివారణలో అద్భుతంగా పనిచేస్తుందని ప్రభుత్వం తెలిపింది. 14 ఏళ్లలోపు బాలికలకు ఈ టీకా అందించడం ద్వారా భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ బారిన పడే ప్రమాదం నుండి 93% నుండి 100% వరకు రక్షణ లభిస్తుందని శాస్త్రీయంగా నిరూపితమైందని వివరించింది. క్యాన్సర్ ముప్పును తగ్గించే ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
తప్పుడు ప్రచారం పై కఠిన చర్యలు..
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని దేశవ్యాప్తంగా ఉచితంగా అందిస్తున్న ఈ వ్యాక్సిన్ భద్రత పై అనుమానాలు రేకెత్తించేలా కొన్ని వర్గాలు చేస్తున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదని కేంద్రం పేర్కొంది. ప్రజలు ఇటువంటి అసత్య వార్తలను నమ్మవద్దని, శాస్త్రీయ ఆధారాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. బాలికల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయం గా సాగుతున్న ఈ టీకా పంపిణీ కార్యక్రమంలో ఎటువంటి అపోహలకు తావులేదని ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే కావాలని అసత్యాలను, అనుమానాలను ప్రచారం చేస్తున్న వారిపై అవసరమైతే చర్యలు తీసుకోవాలని సూచించింది.






