- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గన్ గురిపెట్టి.. మోకాళ్లపై కూర్చోబెట్టి.. కరీంనగర్లో బంగారం దోపిడీ సీసీటీవీ ఫుటేజ్
ఆదివారం కరీంనగర్ పట్టణంలోని PMJ బంగారం దుకాణంలో జరిగిన భారీ దోపిడీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.

దిశ, వెబ్ డెస్క్ : ఆదివారం కరీంనగర్ పట్టణంలోని PMJ బంగారం దుకాణంలో జరిగిన భారీ దోపిడీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఐదుగురు దుండగులు బైకుల మీద కస్టమర్ల లాగ వచ్చి తుపాకీతో కాల్పులు జరిపి మరీ బంగారంతో పారిపోయారు. కాగా సినీ ఫక్కీలో జరిగిన ఈ చోరీ దృశ్యాలు జ్యువెల్లరీ షాపులోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఐదుగురు దుండగులు బంగారం కొంటామని షాపులోకి వచ్చి, నగల వివరాలు అడుగుతూనే ఒక్కసారిగా గన్నులు తీసి షాపు సిబ్బందికి గురిపెట్టారు. అనంతరం సిబ్బంది అందరినీ ఒకదగ్గరికి చేర్చి మోకాళ్లపై కూర్చోబెట్టారు. అనంతరం అందినకాడికి బంగారం తీసుకొని షాపు నుంచి ఉడాయించారు. అయితే దుండగులు పారిపోతూ షాపు సిబ్బందిపై కాల్పులు జరపగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న ఎస్పీ గౌస్ ఆలం ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆస్పత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు. క్లూస్ టీమ్ సహాయంతో జ్యువెల్లరీ షాపు సమీపంలోని డ్రైనేజీలో కత్తెర, ప్లాస్టర్, తుపాకీ మ్యాగ్జీన్‌ను పోలీసులు గుర్తించారు. అలాగే ఘటనాస్థలంలోనూ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. సీసీ ఫుజేటీ ఆధారంగా దుండగుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం చేశారు. వీడియో






