ఫ్రోజెన్ ఫుడ్ విభాగంలో అడుగుపెట్టిన కాంటినెంటల్ కాఫీ.!

by Dishanational1 |
ఫ్రోజెన్ ఫుడ్ విభాగంలో అడుగుపెట్టిన కాంటినెంటల్ కాఫీ.!
X

హైదరాబాద్: ఇటీవల ఆహార అలవాట్లకు సంబంధించి వీగన్ సంస్కృతి వేగవంతంగా పెరుగుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వీగన్ కాఫీ స్టోర్లతో పాటు రెస్టారెంట్లు కూడా ప్రారంభమయ్యాయి. ఇక, ఎఫ్ఎంసీజీ రంగంలోని కంపెనీలు సైతం వినియోగదారుల అభిరుచులను అనుసరించి ప్లాంట్ బేస్‌డ్ మాంస ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీ ఈ విభాగంలో ఉత్పత్తులను తీసుకురాగా, తాజాగా ప్రముఖ కాఫీ బ్రాండ్ కాంటినెంటల్ కాఫీ(సీసీఎల్ ప్రోడక్ట్స్) ఫ్రోజెన్ ఫుడ్స్ విభాగంలో 'కాంటినెంటల్ గ్రీన్‌బర్డ్' ను లాంచ్ చేసింది.

ఇందులో ప్లాంట్ బేస్‌డ్ చికెన్ లైక్ నగెట్స్, చికెన్ లైఫ్ సీక్ కబాబ్, చికెన్ లైక్ సాసేజ్, మటన్ లైక్ ఖీమా వంటి ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వినియోగదారుల కోసం నాణ్యమైన ప్లాంట్ బేస్‌డ్ మాంస ఉత్పత్తులను అందించడానికి కంపెనీ సిద్ధంగా ఉందని, జీవనశైలి, ఆహర ఎంపికల విషయంలో మార్కెట్ అవసరాలను తీర్చడమే లక్ష్యంతో ఈ విభాగంలో ఉత్పత్తులను అందించనున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవల దేశీయంగా ప్లాంట్ బేస్‌డ్ మాంసానికి డిమాండ్ భారీగా పెరుగుతోంది. కరోనా మహమ్మారి పరిస్థితుల తర్వాత ఇది మరింత పెరిగింది. దీంతో కంపెనీ దీనిపై అధ్యయనం చేసి వృద్ధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని కాంటినెంటల్ గ్రీన్‌బర్డ్‌ను ఆవిష్కరించిందని కంపెనీ ఉన్నతాధికారి తెలిపారు.

కంపెనీ అధ్యయనం ప్రకారం, భారత ప్లాంట్ బేస్‌డ్ మాంసం మార్కెట్ రూ. 300 కోట్లు ఉండొద్దని, ఇది ప్రధానంగా ప్యాకేజ్‌డ్ ఫుడ్ విభాగంలో ఉందని కంపెనీ వివరించింది. ఇది మరో మూడేళ్లలో రూ. 3500 నుంచి 3,900 కోట్లకు చేరుకోవచ్చనే అంచనాలున్నాయని కంపెనీ పేర్కొంది. కంపెనీ ప్రవేశపెట్టిన ఉత్పత్తులు బఠానీ, శెనగలు, సోయా బీన్ నుంచి తయారయ్యాయి. ఇవి నిజమైన మాంసం రుచి, రూపం, సువాసన కలిగి ఉంటాయని కంపెనీ వెల్లడించిద్ని.


Next Story

Most Viewed