సీబీఎస్ఈ 10,12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల

by Disha Web Desk 17 |
సీబీఎస్ఈ 10,12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: సీబీఎస్ఈ 10,12 తరగతుల రెండో టర్మ్‌ పరీక్షల షెడ్యూల్‌ను శుక్రవారం విడుదల చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10,12 తరగతులకు ఏప్రిల్-మేలో టర్మ్ 2 పరీక్షలు నిర్వహిస్తోంది.

CBSE టర్మ్ 2 పరీక్షలు 10వ తరగతికి ఏప్రిల్ 26 నుంచి మే 24 వరకు జరగనున్నాయి. 2022 CBSE 10,12తరగతుల డేట్ షీట్‌లు అధికారిక వెబ్‌సైట్ cbse.gov.in, cbsecademic.nic.inలో ఈరోజు విడుదల అయ్యాయి.

CBSE 10వ తరగతి టర్మ్ 2 షెడ్యూల్ :

ఇంగ్లీష్ లాంగ్వేజ్, సాహిత్యం: ఏప్రిల్ 27

గణితం స్టాండర్డ్, బేసిక్: మే 5

హోమ్ సైన్స్: మే 2

సైన్స్: మే 10

సాంఘిక శాస్త్రం: మే 14

హిందీ కోర్సు A, కోర్సు B: మే 18

కంప్యూటర్ అప్లికేషన్స్: మే 23

CBSE బోర్డు పరీక్ష 2022 నమూనా ప్రశ్న పత్రాలు, సిలబస్‌లు CBSE అకడమిక్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.




Next Story

Most Viewed