- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీబీఎస్‌ఈ వివాదంపై మోదీ సర్కార్ కొరడా.. చైర్మన్, సెక్రటరీలపై బదిలీ వేటు!
సీబీఎస్‌ఈ (CBSE) వివాదంపై కేంద్రం కొరడా. ఆన్-స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ లోపాల నేపథ్యంలో బోర్డు చైర్మన్ రాహుల్ సింగ్, సెక్రటరీ హిమాన్షు గుప్తా బదిలీ.

దిశ, వెబ్ డెస్క్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) డిజిటల్ మూల్యాంకన విధానంపై వివాదం రేగడంతో కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. సీబీఎస్‌ఈ చైర్మన్ రాహుల్ సింగ్, బోర్డు సెక్రటరీ హిమాన్షు గుప్తాలపై బదిలీ వేటు వేసింది. బోర్డుకు చెందిన ‘ఆన్-స్క్రీన్ మార్కింగ్ సిస్టం’ (OSM) సేవల కొనుగోలు ప్రక్రియలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు, విద్యార్థుల నుంచి వచ్చిన తీవ్ర ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్రం ఈ కఠిన చర్యలు చేపట్టింది. ఇటీవల వెల్లడైన ఫలితాల తర్వాత, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన తమ జవాబు పత్రాల డిజిటల్ కాపీల లో చేతిరాతలు తమవి కావంటూ పలువురు క్లాస్ 12 విద్యార్థులు ఆరోపించారు. దీనికి తోడు సాంకేతిక లోపాలు, ఈ డిజిటల్ మూల్యాంకన ప్లాట్‌ఫామ్ టెండర్ల ప్రక్రియపై తీవ్ర విమర్శలు రావడంతో పార్లమెంటరీ కమిటీ సైతం ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎస్. రాధా చౌహాన్ నేతృత్వంలో ఏకసభ్య విచారణ కమిటీని నియమించగా, తాజాగా ఉన్నతాధికారులను కూడా బదిలీ చేయడం దేశవ్యాప్తంగా విద్యా రంగంలో పెద్ద సంచలనంగా మారింది.






