- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాళేశ్వరం పై సీబీఐ విచారణ జరపాలి: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంలో బీజేపీ నేతలు తమ బాధ్యతను నెరవేర్చాలని కోరారు.

దిశ, వెబ్ డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం (Construction of Kaleshwaram project)లో జరిగిన అవినీతి, గత ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికార దుర్వినియోగంపై సీబీఐ (CBI) విచారణ జరిపించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) డిమాండ్ చేశారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కంటే ముందే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) ఈ ప్రాజెక్టులో అనేక అవకతవకలు జరిగినట్లు స్పష్టం చేసిందని ఆయన గుర్తుచేశారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా ప్రాజెక్టును నిర్మించిన అధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నారని, కాళేశ్వరం విషయంలో తెలంగాణ ప్రజలకు పూర్తి నిజానిజాలు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ విషయంలో బీజేపీ నాయకులపై బాధ్యత మరింత పెరిగిందని ఎంపీ చామల వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు చొరవ తీసుకుని ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ (CBI investigation)ను వేగవంతం చేయాలని ఆయన కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన తుది తీర్పు వెలువడినప్పుడు అన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన దోపిడీ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించి బాధ్యులను శిక్షించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.






