Amanchi Krishna Mohan: వైసీపీ నేతకు సీబీఐ మరోసారి నోటీసులు

by Bhoopathi Nagaiah |   (  Updated:2022-06-21 12:36:48  IST  )

CBI Issues Notice To YCP Leader Amanchi Krishna Mohan| ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహ‌న్‌కు సీబీఐ అధికారులు షాక్ ఇచ్చారు. న్యాయ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యల కేసులో విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని మరోసారి

CBI Issues Notice To YCP Leader Amanchi Krishna Mohan
X

దిశ, ఏపీ బ్యూరో : CBI Issues Notice To YCP Leader Amanchi Krishna Mohan| ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహ‌న్‌కు సీబీఐ అధికారులు షాక్ ఇచ్చారు. న్యాయ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యల కేసులో విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని మరోసారి ఆమంచికి నోటీసులు అందజేశారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 41(ఎ) కింద అధికారులు నోటీసులు అందజేశారు. బుధవారం విచారణకు హాజరుకావాలని సీబీఐ సమన్లలో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే ఆమంచి కృష్ణమోహన్‌కు సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గతంలో విశాఖ‌లోని సీబీఐ కార్యాల‌యంలో ఆయన విచారణకు హాజరయ్యారు. తాజాగా విజ‌య‌వాడ‌లోని సీబీఐ కార్యాల‌యంలో బుధవారం విచార‌ణ జ‌ర‌గ‌నుంది. ఉద‌యం 10.30 గంట‌ల‌కు త‌మ ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని సీబీఐ అధికారులు ఆమంచిని కోరారు. న్యాయ వ్యవస్థను కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన విషయమై హైకోర్టు ఆదేశాలతో గత ఏడాది నవంబరులో కేసు నమోదు చేసినట్లు ఆ నోటీసులో సీబీఐ పేర్కొన్న విషయం తెలిసిందే.

Next Story