సంక్రాంతి అయినా సరే.. అధిక ఛార్జీలు వసూలు చేయడానికి వీళ్లేదు

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-13 06:53:52  IST  )

జనవరి 7 నుండి జనవరి 12 వరకు జరిపిన ప్రత్యేక తనిఖీల్లో 219 పైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లు రవాణా శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

సంక్రాంతి అయినా సరే.. అధిక ఛార్జీలు వసూలు చేయడానికి వీళ్లేదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: జనవరి 7 నుండి జనవరి 12 వరకు జరిపిన ప్రత్యేక తనిఖీల్లో 219 పైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లు రవాణా శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సరుకు రవాణా చేయడం, ప్రయాణికుల జాబితా లేక పోవడం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేకపోవడం మొదలైన ఉల్లంఘనలపై కేసులు నమోదైనట్లు రవాణా శాఖ తెలిపింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో 8 తనిఖీ బృందాలు ఏర్పాటు చేశామని రవాణా శాఖ తెలిపింది. సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు ఎట్టి పరిస్థితులలో అధిక ఛార్జీలు వసూలు చేయరాదని, స్టేజ్ క్యారేజ్‌గా బస్సులు తిప్పరాదని రవాణాశాఖ హెచ్చరించింది. త్వరలో స్లీపర్ బస్సుల నిర్వహణపై మార్గదర్శకాలు జారీ చేస్తామని, ఇతర రాష్ట్రాలలో రిజిస్టర్ అయ్యి తెలంగాణలో తిరిగే స్లీపర్ బస్సులను తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ అయిన వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ తెలిపింది.

Next Story