Renuka Chowdhury: రేవంత్ రెడ్డి, రేణుక చౌదరిపై కేసు నమోదు

by GSrikanth |   (  Updated:2022-06-16 13:05:40  IST  )

Case Filed Against Congress Leader Renuka Chowdhury For Grabbing cop's collar| తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు రేణుక చౌదరి చిక్కుల్లో పడ్డారు.

Case Filed Against Congress Leader Renuka Chowdhury For Grabbing cops collar
X

దిశ, వెబ్‌డెస్క్: Case Filed Against Congress Leader Renuka Chowdhury For Grabbing cop's collar| తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు రేణుక చౌదరి చిక్కుల్లో పడ్డారు. గురువారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే కారణంతో పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఐపీసీ సెక్షన్లు 151, 140, 147, 149, 341, 353 కింద కేసులు బుక్ చేసినట్లు పంజాగుట్ట పోలీసులు వివరించారు. రాజ్‌భవన్ ముట్టడిలో రేణుకా చౌదరి ఎస్‌ఐ ఉపేంద్ర కాలర్ పట్టుకున్నారు. దాంతో ఆమెపై ఎస్‌ఐ ఉపేంద్ర ఫిర్యాదు చేశారు.

Next Story