కత్తితో వ్యక్తిపై దాడి.. ముగ్గురిపై కేసు నమోదు

by Jakkula.Mamatha |

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో ఓ వ్యక్తి పై ముగ్గురు యువకులు కత్తితో దాడికి పాల్పడిన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.

కత్తితో వ్యక్తిపై దాడి.. ముగ్గురిపై కేసు నమోదు
X

దిశ, మెట్ పల్లి: జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో ఓ వ్యక్తి పై ముగ్గురు యువకులు కత్తితో దాడికి పాల్పడిన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. మెట్ పల్లి ఎస్సై గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ పట్టణానికి చెందిన రాజులదేవి శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి గత కొద్ది రోజులుగా మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో నివాసం ఉంటూ చికెన్ బిర్యానీ(మెస్) నడుపుతూ జీవనం కొనసాగించేవాడు. అయితే దాడికి పాల్పడిన వారి వద్ద చికెన్ కొనే వాడని, వారి వద్ద క్వాలిటీ లేదని శ్రవణ్ వేరే షాప్ లో చికెన్ కొనుగోలు చేసేవాడు.

దాన్ని ఆసరాగా తీసుకున్న నిందితులు ఈనెల 19న రాత్రి 11 గంటలకు సిరిమల్ల హర్షవర్ధన్, బెజ్జరపు నితీష్,హేమంత్ లు శ్రవణ్ ఇంటికి వచ్చి గత కొద్ది రోజులుగా మా వద్ద చికెన్ ఎందుకు కొనడం లేదని రాజులదేవి శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి పై పదునైన కత్తితో దాడికి పాల్పడగా శ్రవణ్ కు తలపై గాయాలయ్యాయని తెలిపారు. సమాచారం అందుకున్న మెట్ పల్లి ఎస్సై 2 గంగాధర్ తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. గాయాలపాలైన శ్రవణ్ కుమార్ ను వెంటనే మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. విచారణ జరిపిన పోలీసులు శనివారం దాడికి పాల్పడిన ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story