ముక్కుపచ్చలైనా ఆరలేదు.. ఎంతటి అఘాయిత్యానికి ఒడిగట్టావురా!

by Kema Shiva Kumar |

మానవత్వం సిగ్గుతో తలదించుకునే అత్యంత దిగ్భ్రాంతికర ఘటన వెలుగుచూసింది.

ముక్కుపచ్చలైనా ఆరలేదు.. ఎంతటి అఘాయిత్యానికి ఒడిగట్టావురా!
X

దిశ, వెబ్‌డెస్క్: అత్యాచారాలపై న్యాయస్థానాల్లో కఠిన శిక్షలు అమలవుతన్నా.. మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుకట్టపడటం లేదు. కామాంధులు కన్నెర్రజేస్తూ.. ఎక్కడో అక్కడ మానవత్వం సిగ్గుతో తలదించుకునే పనులు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం అచ్చం అలాంటి ఘటనపై ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని గోరఖ్‌పూర్ (Gorakhpur) జిల్లాలో చోటుచేసుకుంది. కన్నతల్లి పక్కన నిద్రిస్తున్న కేవలం 9 నెలల వయసున్న పసికందును ఓ 12 ఏళ్ల మైనర్ బాలుడు అర్ధరాత్రి వేళ కిడ్నాప్ చేసి, అత్యాచారానికి ఒడిగట్టాడు. పోర్న్ వీడియోల ప్రభావంతో, మద్యం మత్తులో సదరు బాలుడు ఈ ఘోరానికి పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు. అయితే, నిందితుడు వరుసకు ఆ చిన్నారికి సొంత మేనమామ కావడం షాకింగ్‌కు గురి చేస్తోంది.

అర్ధరాత్రి తల్లి పక్కనుంచే కిడ్నాప్..

బాధితురాలి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి ఆమె తన 9 నెలల కుమార్తెతో కలిసి ఇంట్లో నిద్రిస్తోంది. అర్ధరాత్రి దాటాక సుమారు 2 గంటల సమయంలో ఒక్కసారిగా మేల్కొన్న ఆమెకు పక్కన ఉండాల్సిన బిడ్డ కనిపించలేదు. దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు రాత్రంతా పరిసర ప్రాంతాల్లో గాలించినా పసికందు ఆచూకీ దొరకలేదు. ఇక శనివారం ఉదయం గ్రామానికి కిలో మీటరు దూరంలో ఉన్న ఓ పొలంలోని రేకుల షెడ్డులో పసిపాప స్పృహలేని స్థితిలో, తీవ్ర గాయాలతో పడి ఉండటాన్ని గ్రామస్తులు గుర్తించారు. పాప శరీరంపై తీవ్రమైన గాయాలుండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పాపను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

సీసీ టీవీ విజువల్స్ ఆధారంగా..

ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ (CCTV) ఫుటేజీని పరిశీలించడంతో పాటు, క్రైమ్ సీన్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. స్థానికులను విచారించగా.. చిన్నారి సొంత మేనమామ అయిన 12 ఏళ్ల బాలుడిపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో ఆ బాలుడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. పోర్న్ వీడియోలు చూడటంతో పాటు, మద్యం మత్తులో ఉన్న బాలుడు.. అర్ధరాత్రి తల్లి పక్కన నిద్రిస్తున్న పసిపాపను ఎవరికీ తెలియకుండా ఎత్తుకెళ్లి సమీపంలోని పొలాల్లో అఘాయిత్యానికి పాల్పడినట్లుగా పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. అనంతరం తీవ్ర రక్తస్రావంతో స్పృహతప్పిన పాపను అక్కడే వదిలేసి పారిపోయినట్లు అంగీకరించాడు. దీంతో నిందితుడైన మైనర్ బాలుడిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

Next Story