- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దుర్గగుడిలో దర్శన టికెట్ల గోల్‌మాల్.. వారం రోజుల్లో రెండో ఘటన
ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయం (Kanaka Durga Temple)లో దర్శన టికెట్ల గోల్‌మాల్ వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ ఆలయం (Kanaka Durga Temple)లో దర్శన టికెట్ల గోల్‌మాల్ వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. వారం వ్యవధిలో రెండో ఘటన చోటుచేసుకోవడంతో ఆలయ నిర్వహణలో లోపాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆదివారం భక్తుల రద్దీ కారణంగా అంతరాలయ దర్శనం టికెట్ల విక్రయాలు నిలిపివేయడంతో ఎక్కువ మంది భక్తులు రూ.100 దర్శనం టికెట్లు కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో ఒప్పంద ఉద్యోగి వాసు టికెట్ల ఫైల్‌ను కౌంటర్‌కు ఇవ్వకుండా సెక్యూరిటీ గార్డు ఉమామహేశ్వరి వద్ద ఉంచినట్లు గుర్తించారు. ఆమె వద్ద 58 దర్శన టికెట్లు లభ్యమవడంతో దేవస్థానం అధికారులు అప్రమత్తమయ్యారు.
ఈ ఘటనపై ఈవో శీనానాయక్ ఆదేశాల మేరకు సూపరింటెండెంట్ కె. శ్రీనివాసరావు ఫిర్యాదు చేయగా, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కేసును సీఐ గుణరాము దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల నకిలీ రూ.500 టికెట్ల వ్యవహారంపై కూడా కేసు నమోదైంది. ఈవో ఫిర్యాదుతో రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, హోంగార్డు చంద్రశేఖరిని సస్పెండ్ చేశారు. తాజా ఘటనలో ఇద్దరు ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్లు అధికారుల సమాచారం.






