- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైనర్‌కు మద్యం సరఫరా.. కంపెనీపై కేసు నమోదు
15 సంవత్సరాల బాలుడు ఫుల్ గా మద్యం తాగి.. 7వ అంతస్తు నుంచి పడిపోయి ప్రాణాలు కోల్పోవడం సంచలనంగా మారింది. ఈ షాకింగ్ ఘటన బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: 15 సంవత్సరాల బాలుడు ఫుల్ గా మద్యం తాగి.. 7వ అంతస్తు నుంచి పడిపోయి ప్రాణాలు కోల్పోవడం సంచలనంగా మారింది. ఈ షాకింగ్ ఘటన బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మైనర్ బాలుడికి నిబంధనలకు విరుద్ధంగా మద్యం సరఫరా చేసినట్లు గుర్తించారు. దీంతో ఒక ప్రైవేటు కంపెనీ యజమానులు, సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజరాజేశ్వరి నగర్ పరిధిలోని డాక్టర్ విష్ణువర్ధన్ రోడ్డులో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో నివసించే 15 ఏళ్ల బాలుడు, జనవరి 31 రాత్రి సుమారు 9:40 గంటల సమయంలో తన అపార్ట్‌మెంట్ 7వ అంతస్తు నుంచి పడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రాథమికంగా ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు
మొదట ప్రమాదంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. పోలీసులు మృతుడి స్నేహితులను విచారించి, సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా.. ఘటన జరిగిన రోజున సదరు మైనర్ బాలుడు తన స్నేహితులతో కలిసి అదే ప్రాంతంలోని ఒక కంపెనీకి చెందిన సంస్థలో మద్యం సేవించడం తో పాటు ధూమపానం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
మైనర్ అని తెలిసి కూడా అతనికి మద్యం సరఫరా చేయడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మైనర్లకు మద్యం విక్రయించడం చట్టరీత్యా నేరం కావడంతో పోలీసులు సంబంధిత కంపెనీ యజమానులు, అక్కడి సిబ్బందిపై కఠిన చర్యలకు ఉపక్రమించారు. వారిపై జువైనల్ జస్టిస్ (JJ) యాక్ట్ మరియు కర్ణాటక ఎక్సైజ్ చట్టంలోని నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు.






