- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెగాస్టార్ ఆరోగ్యంపై అసత్య ప్రచారం.. ఛానెల్‌పై కేసు నమోదు
మెగాస్టార్ చిరంజీవిపై మార్ఫింగ్ వీడియోలను సామాజిక మాధ్యమాలలో వైరల్ చేసిన ఒక యూట్యూబ్ ఛానెల్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్యంపై అసత్య ప్రచారాలు చేస్తూ, మార్ఫింగ్ వీడియోలను సామాజిక మాధ్యమాలలో వైరల్ చేసిన ఒక యూట్యూబ్ ఛానెల్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. చిరంజీవి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా, ఆయన ఆరోగ్యంపై తప్పుడు సమాచారంతో కూడిన వీడియోలు, ఫోటోలను ఒక యూట్యూబ్ ఛానెల్ విస్తృతంగా ప్రచారం చేస్తోందని హైదరాబాద్ కమలాపురి కాలనీకి చెందిన న్యాయవాది రామకృష్ణ మిర్యాల సోమవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
సదరు యూట్యూబ్ ఛానెల్ అప్‌లోడ్ చేసిన వివాదాస్పద కంటెంట్‌కు సంబంధించిన వీడియో లింకులు, స్క్రీన్ షాట్లను న్యాయవాది పోలీసులకు సాక్ష్యాలుగా అందజేశారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై, ముఖ్యంగా ఆరోగ్యంపై ఇలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేయడం చట్టవిరుద్ధమని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, ప్రాథమిక పరిశీలన అనంతరం కోర్టు అనుమతి తీసుకుని సదరు యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ఈ అసత్య ప్రచారాల వెనుక ఉన్న బాధ్యులను గుర్తించేందుకు పోలీసులు ప్రస్తుతం దర్యాప్తును ముమ్మరం చేశారు.






