ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఉందా.. అయితే 'రైట్ ఛాయిస్' ఇదే!

by Disha Web Desk 2 |
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఉందా.. అయితే రైట్ ఛాయిస్ ఇదే!
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: స్థాపించిన అతి కొద్ది కాలంలోనే.. 1200లకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి సంచలనాలు సృష్టిస్తోంది రైట్ ఛాయిస్ అకాడమీ. ఎక్కువ మంది గ్రామీణ విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్థాపించిన రైట్ ఛాయిస్ అకాడమీ ప్రస్తుతం రాష్ట్రంలో ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనుకొనే విద్యార్థులకు దిక్సూచిగా నిలుస్తోంది. కొన్ని నెలల ముందు దాకా.. జిల్లా విద్యార్థులు ఎవరైనా పోటీ పరీక్షలకు సిద్ధం కావాలంటే నాణ్యమైన కోచింగ్ కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి. అయితే రైట్ ఛాయిస్ స్థాపనతో ఆ పరిస్థితి మారింది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలంటే ఖమ్మం జిల్లాలోనే కాదు.. తెలంగాలోని ఎన్నో జిల్లాల నుంచి రైట్ ఛాయిస్ అకాడమీకి విద్యార్థులు క్యూ కడుతున్నారు. రాష్ట్రంలోనే అత్యంత అనుభవం ఉన్న సీనియర్ ఫ్యాకల్టీలచే క్లాసులు, ప్రతిరోజూ ఓఎంఆర్ షీట్ ద్వారా మాక్ టెస్ట్‌లు, నాణ్యమైన స్టడీ మెటీరియల్.. ఇలా ప్రతి విషయంలో సరైన శ్రద్ధ తీసుకొని జిల్లా విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దుతోంది రైట్ ఛాయిస్ అకాడమీ.

సంచనల ఫలితాలు..

కోచింగ్ సెంటర్ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే సుమారు 1200లకు పైగా గ్రామీణ విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఘనత రాష్ట్రంలో కేవలం రైట్ ఛాయిస్ అకాడమీది మాత్రమే. వీరిలో గ్రూప్ 2 ర్యాంకర్లు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్, పంచాయతీ సెక్రటరీలు ఇలా అన్ని కేటగిరీలకు చెందిన విద్యార్థులు ఉండటం విశేషం. అంతెందుకు.. ప్రస్తుతం జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్‌లో, ప్రతి మండల ఆఫీసులు, ప్రతి గ్రామంలో కనీసం ఇద్దరు ముగ్గురు రైట్ ఛాయిస్ నుంచి ఉద్యోగాలు సాధించిన వారు ఉన్నారు.

రాష్ట్రంలో అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీలచే శిక్షణ

రాష్ట్రంలోని అత్యంత సీనియర్ ఫ్యాకల్టీలందరూ రైట్ ఛాయిస్ అకాడమీలో పాఠాలు చెప్పడం విశేషం. తెలంగాణా ఉద్యమకారుడు వి.ప్రకాశ్, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ లాంటి హేమాహేమీలే కాకుండా.. ఎంతోమంది దిగ్గజ ఫ్యాకల్టీలు రైట్ ఛాయిస్ విద్యార్థులకు పాఠాలు బోధించడం విశేషం. వీరే కాకుండా రాష్ట్రంలోని దిగ్గజ ఫ్యాకల్టీలైన హిస్టరీ కరీం, పాలిటీ ప్రభాకర్ రెడ్డి, ఎకానమీ పాషాలాంటి వారితో ఆర్సీ ఎగ్జామ్స్ అనే యాప్ ద్వారా రాష్ట్రంలోని విద్యార్థులందరికీ ఆన్ లైన్‌లో గ్రూప్స్, పోలీస్ ఉద్యోగాల శిక్షణ అందిస్తున్నారు.

ప్రతిరోజూ నమూనా పరీక్షలు..

మాక్ టెస్ట్‌ల నిర్వహణకు రైట్ ఛాయిస్ అకాడమీ పెట్టింది పేరు. ప్రతిరోజూ నిర్ణీత సమయంలో ఓఎంఆర్ షీట్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తూ.. అదేరోజూ ప్రశ్నపత్రంపై విశ్లేషణ కూడా చేస్తుంటారు. పెద్ద పెద్ద యూనివర్సిటీలు, సంస్థల దగ్గర జవాబుల మూల్యాంకనానికి ఉండే ఓఎంఆర్ టెక్నాలజీ కేవలం రైట్ ఛాయిస్ అకాడమీలో మాత్రమే ఉండటం విశేషం. అంతేకాకుండా విద్యార్థుల ప్రిపరేషన్ కోసం అకాడమీకి అనుబంధంగా అధునాతన స్టడీ హాల్ కూడా రైట్ ఛాయిస్‌లో ఉంది.

ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులను తయారు చేయడమే లక్ష్యం: మెండెం కిరణ్ కుమార్, అకాడమీ చైర్మన్

సివిల్స్ ఇంటర్వ్యూ దాకా వెళ్లిన అనుభవం ఉండటంతో.. జిల్లాలో కనీసం 100 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా శిక్షణా సంస్థను ప్రారంభించాము. క్రమశిక్షణ, అంకితభావాలే పునాదులుగా ముందుకు సాగటంతో.. అతి కొద్దికాలంలోనే 1200లకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాము. ప్రస్తుతం తెలంగాణాలో వరుసగా ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడనుండటంతో.. వేలాది మంది గ్రామీణ విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. సీరియస్‌గా ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అడ్మిషన్ కోసం.. 8985095599 ఫోన్ నెంబర్‌ను సంప్రదించవచ్చు. ఇతర జిల్లా విద్యార్థుల కోసం హైదరాబాద్‌లో కూడా రైట్ ఛాయిస్ అకాడమీని స్థాపించడం జరిగింది.

రైట్ ఛాయిస్ ద్వారా గ్రూప్ 2 ఉద్యోగం సాధించా: సుజాత, మున్సిపల్ కమిషనర్ సత్తుపల్లి

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే రాష్ట్రంలోనే అత్యున్నత సంస్థ కేవలం రైట్ ఛాయిస్ మాత్రమే. 2016 నోటిఫికేషన్లో నేను 6నెలల పాటు గ్రూప్-2 కోసం రైట్ ఛాయిస్‌లో శిక్షణ తీసుకొని ప్రభుత్వ ఉద్యోగం సాధించా.. సీనియర్ ఫ్యాకల్టీల క్లాసులు, ప్రతిరోజూ నమూనా పరీక్షలు కేవలం రైట్ ఛాయిస్‌లో మాత్రమే ఉంటాయి. సీరియస్‌గా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకొనే వారికి రైట్ ఛాయిస్ మాత్రమే సరైన వేదిక..

ఎస్ఐ ఉద్యోగం సాధించడానికి రైట్ ఛాయిస్: గడ్డం ఉమ, సివిల్ ఎస్ఐ

కిరణ్ సార్ గైడెన్స్‌లో ప్రణాళికా బద్ధంగా రైట్ ఛాయిస్ అకాడమీలో శిక్షణ తీసుకోవడంతో మొదటి ప్రయత్నంలోనే సివిల్ ఎస్ఐగా ఎంపికయ్యాను. ప్రిలిమ్స్, గ్రౌండ్ ప్రాక్టీస్, మెయిన్స్ పరీక్షలకు కేవలం రైట్ ఛాయిస్‌లో మాత్రమే ప్రణాళికాబద్ధమైన శిక్షణ ఉంటుంది. అందుకే ప్రతి నోటిఫికేషన్లో వందలాది మంది విద్యార్థులు పోలీస్ ఉద్యోగాలకు రైట్ ఛాయిస్ నుంచి ఎంపికవుతున్నారు.

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే రైట్ ఛాయిస్ మాత్రమే: రాధ, పంచాయతీ సెక్రటరీ

నేను పంచాయతీ సెక్రటరీ ఉద్యోగం సాధించానంటే కేవలం రైట్ ఛాయిస్ అకాడమీనే కారణం. రాష్ట్రంలోనే అత్యంత సీనియర్ ఫ్యాకల్టీలచే క్లాసులతో పాటు.. ప్రతిరోజూ రెగ్యులర్‌గా మాక్ టెస్టులు కేవలం రైట్ ఛాయిస్‌లో మాత్రమే ఉంటాయి. నాతో పాటు సుమారు 300మందికి పైగా పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలు చేస్తున్న వారందరూ మా రైట్ ఛాయిస్ అకాడమీలోనే శిక్షణ తీసుకోవడం విశేషం.

వందలాది మందికి జీవితాన్ని ఇచ్చింది: యామాల అఖిల, ఏఆర్ కానిస్టేబుల్

రైట్ ఛాయిస్ అకాడమీ నాలాంటి ఎంతో మంది గ్రామీణ విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రతి విద్యార్థినీ ప్రభుత్వ ఉద్యోగిగా తీర్చిదిద్దాలనే అంకితభావంతో శిక్షణ అందిస్తున్న ఏకైక కోచింగ్ సెంటర్ కేవలం రైట్ ఛాయిస్ అకాడమీ మాత్రమే.



Next Story

Most Viewed