- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో దారుణం.. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేసిన ఎస్‌ఐని ఢీకొట్టిన కారు
by Gantepaka Srikanth |
వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులపైకే కారు దూసుకెళ్లిన ఘటన ఆదివారం రంగారెడ్డి యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

X
దిశ, యాచారం: వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులపైకే కారు దూసుకెళ్లిన ఘటన ఆదివారం రంగారెడ్డి యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో ఎస్ఐ మధు ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అతివేగంగా వచ్చిన ఓ కారు రోడ్డుపై ఉన్న ఎస్ఐని బలంగా ఢీకొట్టింది. ఎస్ఐ కారు బానెట్‌పై పడిపోగా.. అలాగే 400 మీటర్లు తీసుకెళ్లారు. అనంతరం సాయి శరణం రైస్ మిల్లు పక్కన రోడ్డు పక్కన పడిపోయాడు. తీవ్రంగా గాయపడటంతో చికిత్స కోసం మాల్‌లోని పీపుల్ ఆసుపత్రికి తరలించారు. కారుతో వెళ్లిన అగంతకుడిని ఇబ్రహీంపట్నంలో పోలీసులు గుర్తించి పట్టుకున్నారు.
Next Story






