ఔటర్ రింగ్ రోడ్డుపై మంటల్లో చిక్కుకున్న కారు

by Muthe.Rajitha |   (  Updated:2026-01-28 01:38:54  IST  )

ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ కారు మంటల్లో చిక్కుకొని కాలి బూడిదైంది.

ఔటర్ రింగ్ రోడ్డుపై మంటల్లో చిక్కుకున్న కారు
X

దిశ, వెబ్ డెస్క్ : ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ కారు మంటల్లో చిక్కుకొని కాలి బూడిదైంది. హైదరాబాద్‌లో రాజేంద్రనగర్ పోలీస్ అకాడమీ సమీపంలోని ఔటర్ రింగు రోడ్డుపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా నితిన్ అనే వ్యక్తి కారులో తుక్కుగూడ నుంచి నార్సింగి వైపు వెళ్తుండగా, మంచిరేవుల ప్రాంతంలో డ్రైవర్ సీటు దగ్గర కాళ్ల వద్ద అకస్మాత్తుగా వేడి తగలడంతో ఆయన అప్రమత్తమయ్యాడు. వెంటనే కారును రోడ్డుపక్కకు నిలిపి బయటకు దిగి చూడగా.. కారు కింది భాగంలో మంటలు అంటుకున్నాయి. అయితే క్షణాల్లోనేఆ మంటలు వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనతో కొంతసేపు ఔటర్ రింగు రోడ్డుపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ముందుగానే జాగ్రత్తపడి కిందికి దిగడంతో నితిన్ ప్రాణాలతో బయటపడ్డాడు. కాగా ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.

Next Story