- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేదల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే సాయన్న
by Vinod kumar |
దిశ, కంటోన్మెంట్: పేదల - Cantonment MLA Sayanna said the health of the poor was the government's objective

X
దిశ, కంటోన్మెంట్: పేదల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న అన్నారు. తిరుమలగిరికి చెందిన పద్నాలుగేళ్ల ఆయుష్ సింగ్ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుండగా, బాపూజీ నగర్ కు చెందిన వెంకటేష్ అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో చేరాడు. ఈ విషయం ఎమ్మెల్యే సాయన్న దృష్టికి తీసుకువెళ్లగా, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎల్వోసీ లను మంజూరు చేయించారు. సోమవారం కార్ఖానాలోని తన క్యాంపు కార్యాలయంలో వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆయుష్ సింగ్ కు రూ. 2 లక్షలు, వెంకటేశ్ కు రూ. ఒక లక్షల చొప్పున ఎల్వోసీ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రిలిఫ్ పండ్ ద్వారా అనేక మంది పేద ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించినట్లు తెలిపారు.
Next Story






