- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Massage: మసాజ్ తర్వాత వెంటనే స్నానం చెయొచ్చా..?
శరీరానికి మసాజ్ (Massage) చేయడం వల్ల శారీరకంగా (Physically), మానసికం(mentally)గా అనేక లాభాలున్నాయని తరచూ నిపుణులు చెబుతూనే ఉంటారు.

దిశ, వెబ్‌డెస్క్: శరీరానికి మసాజ్ (Massage) చేయడం వల్ల శారీరకంగా (Physically), మానసికం(mentally)గా అనేక లాభాలున్నాయని తరచూ నిపుణులు చెబుతూనే ఉంటారు. మసాజ్ వల్ల బ్లడ్ సర్కులేషన్ (Blood circulation) కూడా మెరుగుపడుతుంది. అంతేకాకుండా కండరాల ఒత్తిడి (Muscle tension) తగ్గించంలో, కండరాల్ని బలపర్చుతుంది (Strengthens the muscles). డిప్రెషన్ (Depression) నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. రోగనిరోధక శక్తి (Immunity) పెరుగుతుంది. శరీరం కాంతివంతం(Brightly)గా మార్చడంలో, నిద్రలేమి సమస్యల్ని (Insomnia problems) తరిమికొట్టడంలో, బరువు తగ్గడానికి (lose weight) కూడా మసాజ్ ఉపయోగపడుతుంది.
మసాజ్ చేయడం వల్ల మానసికంగా ధృఢంగా(Mentally strong) మారతారు. మసాజ్ థెరపీ (Massage therapy) అనేది మాన్యువల్ థెరపీ (Manual therapy) యొక్క ఒక రూపం. మసాజ్ చేయడం వల్ల మొత్తం శరీర పనితీరు (body function) మెరుగుపడుతుంది. అయితే మసాజ్ ఎప్పుడు చేస్తే శరీరానికి మేలు జరుగుతుందని తాజాగా నిపుణులు చెబుతున్నారు. స్నానానికి ముందు చేయాలా? లేక స్నానం చేసిన తర్వాతనా? అనే దానిపై నిపుణులు క్లారిటీ ఇచ్చారు.
మసాజ్ చేసిన వెంటనే స్నానం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. మసాజ్ చేసిన అనంతరం కనీసం రెండు నుంచి మూడు గంటలు వెయిట్ చేశాక.. స్నానం చేస్తే శరీరానికి ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు. మసాజ్ తర్వాత నూనెలు స్కిన్ ను పోషించడమే కాకుండా.. వెంటనే స్నానం చేస్తే శరానికి కలగాల్సిన ప్రయోజనాలు పోతాయి. కాగా మసాజ్ చేశాక ఎక్కువగా వాటర్ తాగడం (Drinking more water) లేదా హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం(Consuming healthy foods), రెస్ట్ తీసుకోవడం (Taking rest) వంటివి చేయండని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.






