Oranges: ప్రెగ్నెన్సీతో ఉన్న మహిళలు నారింజ పండ్లు తినొచ్చా.. ?

by Kodari Anjali |

బిడ్డ కడుపులో పడ్డప్పటి నుంచి మహిళలు చాలా జగ్రత్తగా నడుచుకుంటారు.

Oranges: ప్రెగ్నెన్సీతో ఉన్న మహిళలు నారింజ పండ్లు తినొచ్చా.. ?
X

దిశ, వెబ్‌డెస్క్: బిడ్డ కడుపులో పడ్డప్పటి నుంచి మహిళలు చాలా జగ్రత్తగా నడుచుకుంటారు. నడవడంలో... తీసుకునే ఫుడ్ విషయంలో కూడా చాలా కేరింగ్‌గా ఉంటారు. బిడ్డ ఆరోగ్యం కోసం పగలు సాధ్యమైనంత ఎక్కువగా ద్రావాలు తీసుకోవడం, కారం తక్కువగా ఉండే పదార్థాలు తింటుంటారు. కానీ కొంతమందికి బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఏమీ తినాలో, తినకూడదో అంతగా అవగాహన ఉండదు.

ఒకవేళ వైద్యులు సూచించిన మర్చిపోయి తింటుంటారు. కడుపులోని బిడ్డకు హాని కలిగించే పదార్థాలని తెలియక తింటుంటారు. మరీ గర్భం దాల్చాక నారింజ పండ్లు తినాలా? వద్దా? అని చాలా మందిలో సందేహాలు వ్యక్తం అవుతుంటాయి. తాజాగా దీనిపై నిపుణులు వివరించిన తీరు చూసినట్లైతే..

ఇక నారింజ పండు ఆరోగ్య ప్రయోజనాలు అందరికీ తెలిసిందే. విటమిన్ సి, ఖనిజాలు, పోషకాలు దట్టంగా ఉంటాయి. నారింజ పండు తింటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వీటిలో ఉండే ఇనుము శోషణను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా.. రక్తపోటును తగ్గించడంలో మేలు చేస్తుంది. చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. సూర్యరశ్మి నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.

వీటితో పాటుగా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే క్యాన్సర్‌ను నియంత్రిస్తుంది.గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వయస్సు సంబంధిత మచ్చల క్షీణతను నెమ్మదించడంలో ఉపయోగపడుతుంది. నారింజ ఫ్రూట్‌ను రసం కాకుండా పండు రూపంలోనే తినడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. అతిగా నారింజ పండ్లు తినడం వల్ల విటమిన్-సి అధిక మోతాదుకు దారితీయవచ్చు మరీ అని నిపుణులు వెల్లడిస్తున్నారు.

అయితే ప్రెగ్నెన్సీ మహిళలు నారింజ పండ్లు తినడం మంచిదేనా? తినవచ్చా? అని నిపుణులు క్లారిటీ ఇస్తున్నారు. అయితే గర్భధారణలో హైడ్రేషన్ చాలా ముఖ్యం. కాగా నారింజ తినడం వల్ల రక్తహీనత ప్రాబ్లమ్ దరిచేరదు. శరీరం తేమవంతంగా ఉంటుంది. కాగా డీహైడ్రేషన్ బారిన శరీరం పడకుండా నారింజ అడ్డుకుంటుంది.

అలాగే నారింజ పండ్లలో ఉండే పోషకాలు పిండం ఎదుగుదలకు సహాయపడుతాయి. ఎముకలు, మెదడు వెన్నుపాముకు పోషణను అందిస్తాయి. కాగా ప్రెగ్నెన్సీ మహిళలు ప్రతిరోజూ కనీసం 85 మిల్లీ గ్రాముల విటమిన్ సి తినాలి. రోజుకు రెండు పండ్లు మాత్రమే తినాలని నిపుణులు సూచిస్తున్నారు. కాగా రెండు నారింజల కంటే ఎక్కువ తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సం ప్రదించగలరు.

Next Story