ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ నామినేషన్ల ఆహ్వానం

by Batti.Sumithra |

వివిధ రంగాలలో అసాధారణ ప్రతిభ కనబరిచిన పిల్లలను జాతీయ స్థాయిలో గుర్తించేందుకు భారత ప్రభుత్వం అందించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ - 2025 కు ఆన్‌లైన్ నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారిణి లలిత కుమారి తెలిపారు.

ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ నామినేషన్ల ఆహ్వానం
X

దిశ, సంగారెడ్డి అర్బన్ : వివిధ రంగాలలో అసాధారణ ప్రతిభ కనబరిచిన పిల్లలను జాతీయ స్థాయిలో గుర్తించేందుకు భారత ప్రభుత్వం అందించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ - 2025 కు ఆన్‌లైన్ నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారిణి లలిత కుమారి తెలిపారు. సాహస కృత్యాలు, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు-సంస్కృతి, సైన్స్-టెక్నాలజీ, ఇన్నోవేషన్ అనే 7 కేటగిరీలలో ఈ అవార్డులు అందజేస్తారు. 31 జులై 2026 నాటికి 5 నుండి 18 సంవత్సరాల లోపు వయస్సు గల భారతీయ పిల్లలు ఈ అవార్డుకు అర్హులు.

గ్రామీణ ప్రాంతాలు, మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాలలోని ప్రతిభావంతులైన పిల్లలు, ముఖ్యంగా బాలికలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ పిల్లల నామినేషన్లకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె కోరారు. ఆసక్తిగల వారు https://awards.gov.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని, నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని అన్నారు. దరఖాస్తులకు చివరి తేదీ 31 జులై 2026 గడువు తర్వాత వచ్చే దరఖాస్తులు స్వీకరించబడవని ఆమె స్పష్టం చేశారు. జిల్లాలోని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు గుర్తింపునకు నోచుకోని ప్రతిభావంతులను గుర్తించి అవార్డుకు నామినేట్ చేయాలని జిల్లా సంక్షేమ అధికారిణి విజ్ఞప్తి చేశారు.

Next Story