TG: మున్సిపల్ ఎన్నికలు, జిల్లాల పునర్విభజనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-18 15:37:06  IST  )

మేడారం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

TG: మున్సిపల్ ఎన్నికలు, జిల్లాల పునర్విభజనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్‌డెస్క్: మేడారం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన జరుగుతున్న రాష్ట్ర మంత్రిమండలి(Telangana Cabinet) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికలు, జిల్లాల పునర్విభజనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి రెండో వారంలో మున్సిపల్ ఎన్నికలకు నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. కాగా, ఇటీవలే రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాలిటీల చైర్‌పర్సన్ల పదవులకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. సామాజిక సమీకరణాలు, జనాభా ప్రాతిపదికన ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లను ముందుగా నిర్ణయించి.. అనంతరం లాటరీ పద్ధతిలో మహిళలకు.. బీసీలకు స్థానాలను కేటాయించారు.

మరోవైపు.. జిల్లాల పునర్వ్యస్థీకరణపై రిటైర్డ్ జడ్జి, విశ్రాంత అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కనీసం ఆరు నెలల్లోగా రిపోర్ట్ ఇవ్వాలని కోరుతామని.. వాటి ఆధారంగానే మరోసారి జిల్లాలను శాస్త్రీయ విభజన చేస్తామన్నారు. గతంలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన జరిగిందన్నారు. పక్కా ప్రణాళికతో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం జిల్లాల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టత ఇచ్చారు.

Next Story