జాతీయ రహదారిపై బస్సు బోల్తా

by Jakkula.Mamatha |

పెబ్బేరు పట్టణ సమీపంలో ఎన్ హెచ్ 44 పై వనపర్తి డిపోకు చెందిన బస్సు (TG 32 Z 0015 నెంబర్) 61 మంది ప్రయాణికులతో మంత్రాలయం నుంచి వనపర్తికి బయలుదేరింది

జాతీయ రహదారిపై బస్సు బోల్తా
X

దిశ, పెబ్బేరు: పెబ్బేరు పట్టణ సమీపంలో ఎన్ హెచ్ 44 పై వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (TG 32 Z 0015 నెంబర్) 61 మంది ప్రయాణికులతో మంత్రాలయం నుంచి వనపర్తికి బయలుదేరింది. ఈ క్రమంలో పెబ్బేరుకు సమీపంలో బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. 16 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు కావడంతో వనపర్తి ఏరియా హాస్పిటల్ కి అంబులెన్స్ లో తరలించారు. ఈ ఘటనతో నేషనల్ హైవే 44 పై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.

Next Story