హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై బస్సు లారీ ఢీ

by Jakkula.Mamatha |

హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం పరిధిలోని ముత్యాలమ్మ గూడెం వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై బస్సు లారీ ఢీ
X

దిశ, నకిరేకల్: హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం పరిధిలోని ముత్యాలమ్మ గూడెం వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భీమవరం నుంచి హైదరాబాద్ వెళుతున్న ఇంటర్నెట్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముత్యాలమ్మ గూడెం వద్ద టైర్ పగిలిపోయింది. దీంతో ఆ బస్సు డివైడర్ను దాటుకొని హైదరాబాద్ నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న దారిలోకి వెళ్ళిపోయింది. అంతలోనే సూర్యాపేట వైపుకు వెళ్తున్న లారీ రావడంతో ఆ లారీని ఢీకొట్టింది.

ఈ ఘటనలో బస్సులో 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నప్పటికీ కేవలం చిన్న గాయాలు మాత్రమే తగిలాయి. బలంగా బస్సు లారీని ఢీ కొట్టడంతో డ్రైవర్ బస్సులో చిక్కుకున్నారు. 108కు సమాచారం అందించడంతో అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి శ్రీనివాస్, పైలట్ సమీర్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయాలైన ప్రయాణికులను ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంత పెద్ద మొత్తంలో ప్రమాదం జరిగినప్పటికీ ఎవరికి బలమైన గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Next Story