- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నల్లగొండ మేయర్ అభ్యర్థిగా బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
నల్లగొండ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోరుకు తెర లేచింది.

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోరుకు తెర లేచింది. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థుల తొలి జాబితాను అధికారికంగా ప్రకటించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున మేయర్ అభ్యర్థిగా బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డిని ఖరారు చేశారు. ఆమెతో పాటు మొదటి విడతలో మొత్తం 44 మంది కార్పొరేటర్ అభ్యర్థుల పేర్లను మంత్రి వెల్లడించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఆమోదంతో, సామాజిక న్యాయాన్ని పాటిస్తూ అభ్యర్థులను ఎంపిక చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు.
నల్లగొండ అభివృద్ధికి పెద్దపీట
నల్లగొండ మునిసిపాలిటీని కార్పొరేషన్‌గా మార్చడం పట్టణ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయమని మంత్రి అభివర్ణించారు. ప్రస్తుతం పట్టణంలో రూ.2,200 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో నల్లగొండను తెలంగాణలోనే నంబర్ వన్ పట్టణంగా, సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాని ప్రజలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు.
అభ్యర్థుల జాబితా ఇదే..






