- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జొన్నల కొనుగోళ్లలో రైతుపైనే భారం..!
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో పండిన జొన్నలను కంగ్టి, బాచేప ల్లి, కల్లేర్ పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో కొను గోలు చేస్తున్నారు.

దిశ, కంగ్టి: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో పండిన జొన్నలను కంగ్టి, బాచేప ల్లి, కల్లేర్ పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో కొను గోలు చేస్తున్నారు. ఆయా సొసైటీల పరిధిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల ఇబ్బందులు రోజురోజుకూ పెరుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటి నుంచి గోనె సంచుల కొరత, కొనుగోళ్లలో జాప్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో కురిసిన అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ ఉంచిన జొన్నలు తడిసి, పలుచోట్ల మొలకెత్తడంతో రైతులు భారీ నష్టాలను చవిచూశారు. అదేవిధంగా ఆయా గ్రామాల్లో సొసైటీల ఆధ్వర్యంలో గ్రామ పెద్దల సహకారంతో రైతుల వద్ద నుంచి జొన్నలను సేకరించి కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు.
ఇప్పటికే పంట నష్టం..
సేకరించిన ధాన్యాన్ని కేంద్రాలకు చేర్చే ప్రక్రియలో కూడా పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే పంట నష్టాలతో ఆర్థికంగా దెబ్బతిన్న రైతులపై కొనుగోలు ప్రక్రియ లో అదనపు భారం పడుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు జొన్నలను తరలించేందుకు అవసరమైన వాహనాలను రైతులే స్వయంగా మాట్లాడుకుని ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోందని సమాచారం. ట్రాన్స్‌పోర్ట్ కోసం అయ్యే ఖర్చును కూడా రైతులే భరిస్తున్నట్లు చెబుతున్నారు. రవాణా ఖర్చులతో పాటు లోడింగ్, అన్‌లోడింగ్ పనులకు హమాలీలకు క్వింటాల్‌కు రూ.100 నుంచి రూ.150 వరకు రైతులే చెల్లిస్తున్నట్లు పేర్కొంటున్నారు.
గోనె సంచుల కొరత..
అలాగే కొనుగోలు కేంద్రాలకు సరిపడా గోనె సంచులు అందుబాటులో లేకపోవడంతో రైతులే స్వయంగా సంచులు కొనుగోలు చేసి జొన్నలను నింపుతున్న ట్లు సమాచారం. దీంతో సంచుల ఖర్చు కూడా తమపైనే పడుతూ అదనపు ఆర్థిక భారం పెరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ప్రమాణాలకు మించి 51 కిలోల 500 గ్రాముల నుంచి 52 కిలోల 200 గ్రాముల వరకు తూకం వేస్తున్నారని రైతులు వాపోతున్నారు. దీంతో ప్రతి క్వింటాల్‌పై రైతుల కు అదనపు నష్టం వాటిల్లుతోందని చెబుతున్నారు.
సరిహద్దు రాష్ట్రాల నుంచి..
స్థానిక రైతుల జొన్నలతో పాటు దళారుల ద్వారా ఇతర ప్రాంతాల నుంచి, ముఖ్యం గా కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా జొన్నలు కొనుగోలు కేంద్రాలకు చేరుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో స్థానిక రైతుల పంట కొనుగోళ్లకు ఆటంకం కలుగుతోందని వారు అంటున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటికే వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రైతుల్లో మరింత ఆందోళన నెలకొంది.
కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు..
కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అవకతవకలపై బహిరంగంగా మాట్లాడేందుకు రైతులు భయపడుతున్న పరిస్థితి నెలకొం ది. సమస్యల పై ముందుకు వచ్చి ప్రశ్నిస్తే తమ జొన్నలను కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తారనే అనుమానంతో పలువురు రైతులు మౌనం పాటిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రైతుల అసలు సమస్యలు వెలుగులోకి రావడం లేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి రైతులకు న్యా యం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.






