- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం.. ఎస్ఐ పై కేసు
వరంగల్ పోలీసు కమిషనరేట్ సీసీఎస్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐ గోదారి రాజ్‌కుమార్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి భర్తకు విడాకులు తీసుకునేలా చేసి, శారీరకంగా దుర్వినియోగం చేసి ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా వేధిస్తున్నాడని ఓ మహిళ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : వరంగల్ పోలీసు కమిషనరేట్ సీసీఎస్ విభాగంలో పని చేస్తున్న ఎస్ఐ గోదారి రాజ్‌కుమార్ ఓ వివాహితను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన భర్తకు విడాకులు ఇప్పించి శారీరకంగా లొంగ తీసుకుని పెళ్లి చేసుకోకపోగా తీవ్ర ఇబ్బందుల గురి చేస్తున్నారని బాధిత మహిళ పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు హనుమకొండ పోలీసు స్టేషన్‌లో నిందితుడు ఎస్ఐ రాజ్ కుమార్ పై పలు సెక్లన కింద కేసునమోదైంది. బాధితురాలు ఫిర్యాదు, హనుమకొండ పోలీసుల కథనం ప్రకారం హనుమకొండకు చెందిన యువతికి 2018లో బీ ఫార్మసీ చదువుతున్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడి పెళ్లి చేసుకున్నారు.
వీరికి ఒక పాప కూడా ఉన్నారు. కొద్దిరోజుల తర్వాత ఇద్దరి మధ్య కుటుంబ కలహాలు రావడంతో 2022 మార్చిలో బాధిత వివాహిత భర్తపై హనుమకొండ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అపుడు ఆ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న గోదారి ఎస్ఐ రాజ్ కుమార్ న్యాయం చేస్తానని నమ్మించి, అతడికి తెలిసిన న్యాయవాదితో భర్తకు విడాకులు ఇప్పించాడు. తర్వాత పెళ్లి చేసుకుంటాను అని ఆ వివాహితను నమ్మించి, లొంగదీసుకుని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె రెండు సార్లు గర్భం దార్చలడంతో అబార్షన్ చేయించాడు. బాధిత వివాహిత పెళ్లి విషయం పై ఎస్ఐ రాజ్ కుమార్‌ను గట్టిగా నిలదీయడంతో న్యూడ్ ఫొటోస్ తో బ్లాక్ మెయిల్ చేస్తూ, బెదిరింపులకు పాల్పడడం, ఆమె పనిచేసే చోటకి ఫోన్ నంబర్ లొకేషన్ తెలుసుకుని అక్కడి నుండి, బలవంతంగా హోటల్స్ కి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఆమె ఫోన్ నంబర్స్ ట్రాక్ చేసి అనుమానించి వేధింపులకు పాల్పడ్డాడు. ఈ నెల మొదటి వారంలో ఎస్ఐ రాజ్ కుమార్, బాధిత వివాహితను హనుమకొండలోని ఓ హోటల్‌కు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడి జీవితాంతం తనతోనే లైంగికంగా ఉండాలి, లేదంటే న్యూడ్ పిక్స్ బయట పెడతా అని బ్లాక్ మెయిల్ చేశాడని తెలిపారు. బాధిత మహిళ ఎస్ఐ అరాచకాన్ని భరించలేక రెండు రోజుల క్రితం హైదరాబాదులోని ఐజీకి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ ఉన్నత అధికారి ఆదేశాల మేరకు భరోసా సెంటర్‌లో శనివారం మహిళా పోలీసు అధికారి బాధితురాలి స్టేట్‌మెంట్ తీసుకుని హనుమకొండ పీఎస్‌కు రిఫర్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు హనుమకొండ పీఎస్ లో ఎస్ఐ రాజ్ కుమార్ పై లైంగిక దాడి, బెదిరింపు, చీటింగ్ సెక్షన్ల కింద కేసులునమోదు చేసినట్లు హనుమకొండ ఇన్‌స్పెక్టర్ మచ్చ శివ కుమార్ తెలిపారు. కాగా నిందితుడు ఎస్ఐ రాజ్ కుమార్ వరంగల్ పోలీసు కమిషనరేట్ సీసీఎస్ విభాగంలో పని చేస్తున్నాడు.






