- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగ్లా సరిహద్దు కంచెపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు!
బంగ్లాదేశ్‌తో ఉన్న 1600 కిమీ సరిహద్దుల్లో కేవలం అసోంలోనే కంచె వేయాలనుకోవడం చారిత్రక తప్పిదమని, అన్ని రాష్ట్రాల సరిహద్దులను మూసివేయాల్సి ఉందని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల జరిగిన అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం తర్వాత మరోసారి అధికారంలోకి వచ్చిన సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలనాలకు కేర్ అఫ్ అడ్రస్ గా మారిపోయారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దు, పౌరులపై ఆయన కఠిన నిర్ణయాలు తీసుకుంటు నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన బంగ్లా సరిహద్దు కంచె పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 1985 నాటి చారిత్రక 'అసోం ఒప్పందం' ప్రకారం కేవలం అసోం పరిధిలోనే కంచె వేయాలని కోరడం ఒక పెద్ద చారిత్రక తప్పిదమని, బంగ్లాదేశ్‌తో పంచుకునే మొత్తం 1600 కిలోమీటర్ల మేర ఉన్న అన్ని రాష్ట్రాల సరిహద్దులను ఒకేసారి పూర్తిగా మూసివేయాలని నాడే డిమాండ్ చేసి ఉండాల్సిందని ఆయన పేర్కొన్నారు. ఒకవైపు అసోం సరిహద్దులను మూసివేసి, పశ్చిమ బెంగాల్ (800 కిమీ), మేఘాలయ, త్రిపుర వంటి ఇతర రాష్ట్రాల సరిహద్దులను తెరిచి ఉంచడం వల్లే ఇన్నాళ్లూ బంగ్లాదేశ్ చొరబాట్లను అడ్డుకోలేకపోయామని మండిపడ్డారు. ప్రస్తుతం మోదీ ప్రభుత్వ హయాంలో.. ముఖ్యంగా 2025 నుంచి మేఘాలయలో 90 శాతం, త్రిపురలో 60 శాతంతో పాటు బెంగాల్, మిజోరంలోనూ కంచె పనులు వేగంగా సాగుతున్నాయని ఆయన వివరించారు.
ఇదే సమయంలో సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్న జనాభా మార్పులపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని, దీని ద్వారా కేంద్రం మున్ముందు మరిన్ని సమర్థవంతమైన చర్యలు తీసుకోబోతోందని సీఎం హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. ఈ వ్యవహారంలో అసోం ప్రభుత్వం తరఫున కేంద్రానికి ఒక గట్టి ప్రతిపాదన చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. బంగ్లాదేశ్ సరిహద్దులను ఆనుకుని నివసిస్తున్న ప్రతి ఒక్క కుటుంబం యొక్క పౌరసత్వాన్ని (Citizenship Scrutiny) క్షుణ్ణంగా పరిశీలించి, ధృవీకరించాలని తాము కేంద్రానికి సూచించబోతున్నట్లు సీఎం స్పష్టం చేశారు.






