- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను స్వలింగ్ సంపర్కురాలిని కాదు.. విడాకుల తర్వాత వచ్చిన ట్రోలింగ్‌పై మౌని రాయ్ ఎమోషనల్ కామెంట్స్
కేవలం సోషల్ మీడియాలో పెట్టే ఫొటోలు, వీడియోలు లేదా బయట స్నేహితులతో కలిసి తిరిగే విజువల్స్ ఆధారంగా ఎవరూ ఒకరి వ్యక్తిగత జీవితంపై ఎలాంటి అంచనాలకు లేదా తప్పుడు నిర్ధారణలకు రాకూడదని ఆమె ప్రజలను, నెటిజన్లను కోరారు.

దిశ, సినిమా: బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌని రాయ్ గత కొద్ది కాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తన వ్యక్తిగత జీవితంతో దారుణమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు. 2022లో వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌ను వివాహం చేసుకున్న మౌని రాయ్, ఇటీవల మే 2026లో తమ విడాకుల ప్రకటనను అధికారికంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ విడాకుల తర్వాత ఆమెపై రకరకాల పుకార్లు షురూ అయ్యాయి. ఆమెను గే అంటూ కొందరు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అందుకే దిశా పటానీతో రిలేషన్‌లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, మౌని రాయ్, తన గురించి విన్న అతిపెద్ద రూమర్ ఏంటని అడగ్గా.. యాంకర్ అడగ్గా.. నేను గే అనే ప్రచారం అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. విడాకుల తర్వాత ఎదురైన క్లిష్ట పరిస్థితులను ఎలా అధిగమించారో ఈ సందర్భంగా మౌని రాయ్ పంచుకున్నారు. తన జీవితంలో మంచి, చెడు సమయాల్లో తన కుటుంబంతో పాటు ముఖ్యంగా తన స్నేహితురాళ్లు కొండలా అండగా నిలిచారని అది తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. తన ఫ్రెండ్స్ మంచి చెడు సందర్భాల్లోనూ తనకు తోడుగా నిలిచారని అన్నారు.
ప్రతి మహిళ జీవితంలోనూ తోటి మహిళల మద్దతు ఉండటం ఎంతో ముఖ్యమని, వారు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ మానసికంగా బలాన్ని ఇస్తారని చెప్పారు. అలాగే నేటితరం యువతులు జీవితంలో వచ్చే హెచ్చుతగ్గులను తట్టుకుని నిలబడాలంటే.. ఆర్థికంగా, మానసికంగా స్వతంత్రంగా ఎదగడం చాలా అవసరమని మౌని రాయ్ సూచించారు. అంతేకాకుండా దిశ పటానీతో తనకున్న అనుబంధం గురించి మాట్లాడుతూ.. ఆమె తనకు మంచి ఫ్రెండ్ మాత్రమే కాకుండా మంచి చెడు, కష్టసమయాల్లో తనకు అండగా నిలుస్తుందని చెప్పుకొచ్చారు. అలాగే తాను స్వలింగ్ సంపర్కురాలిని కాదని మౌని రాయ్ స్పష్టం చేశారు. కేవలం సోషల్ మీడియాలో పెట్టే ఫొటోలు, వీడియోలు లేదా బయట స్నేహితులతో కలిసి తిరిగే విజువల్స్ ఆధారంగా ఎవరూ ఒకరి వ్యక్తిగత జీవితంపై ఎలాంటి అంచనాలకు లేదా తప్పుడు నిర్ధారణలకు రాకూడదని ఆమె ప్రజలను, నెటిజన్లను కోరారు. నిజమైన స్నేహ బంధాలు ఎంతో పవిత్రమైనవని, అవి ఎల్లప్పుడూ గౌరవానికి అర్హమైనవని మౌని రాయ్ అభిప్రాయపడ్డారు. కేవలం వెబ్‌సైట్లలో క్లిక్స్ కోసం, పబ్లిసిటీ కోసం లేదా తప్పుడు ప్రచారం కోసం ఒకరి మంచి స్నేహాన్ని తప్పుగా వక్రీకరించడం అస్సలు మంచి పద్ధతి కాదని ఆమె పేర్కొన్నారు.






