ప్రధాని పొదుపు - పిలుపు.. ఎడ్ల బండిపై బారాత్

by Muthe.Rajitha |

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఒక పోలీసు కానిస్టేబుల్ తన వివాహ వేడుకలో ఇంధన పొదుపుపై అవగాహన కల్పిస్తూ పెళ్లి బారాత్ ను ఎడ్ల బండిపై నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

ప్రధాని పొదుపు - పిలుపు.. ఎడ్ల బండిపై బారాత్
X

దిశ, వెబ్ డెస్క్ : మిడిల్ ఈస్ట్ దేశాల్లో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఏర్పడ్డ ఆయిల్ క్రైసిస్ ను అధిగమించడానికి ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ పొదుపు చర్యలకు పిలుపినిచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని పిలుపునందుకొని వివిధ రాష్ట్రాల సీఎంలు వారి కాన్వాయ్ లను భారీగా తగ్గించుకోగా.. అధికారులు సైకిళ్ళ బాట పట్టారు. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఒక పోలీసు కానిస్టేబుల్ తన వివాహ వేడుకలో ఇంధన పొదుపుపై అవగాహన కల్పిస్తూ పెళ్లి బారాత్ ను ఎడ్ల బండిపై నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

నారాయణ్‌పుర్ ఎస్పీకి గన్‌మెన్‌గా పనిచేస్తున్న కుబేర్ దెహారీ అనే కానిస్టేబుల్, తన పెళ్లి ఊరేగింపు కోసం ఖరీదైన కార్లు వాడకుండా వినూత్నంగా ఆలోచించాడు. దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న వధువు ఇంటికి వెళ్లేందుకు ఆయన ఎడ్లబండ్లను ఎంచుకున్నారు. వరుడి కుటుంబం మొత్తం ఎడ్లబండ్లపైనే ఊరేగింపుగా వెళ్లడం విశేషం. పర్యావరణ హితంగా, ఇంధనాన్ని ఆదా చేస్తూ సాగిన ఈ పెళ్లి వేడుక దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నాయి.

Next Story