కరెన్సీ కాగితాలు పనికి రాకుండా పోతాయి : బల్గెరియా బాబా సంచలన జోస్యం

by Muthe.Rajitha |

బల్గేరియాకు చెందిన ప్రసిద్ధ జ్యోతిష్కురాలు బాబా వెంగా చేసిన జోస్యం మరోసారి వార్తల్లో నిలిచింది.

కరెన్సీ కాగితాలు పనికి రాకుండా పోతాయి : బల్గెరియా బాబా సంచలన జోస్యం
X

దిశ, వెబ్ డెస్క్ : బల్గేరియాకు చెందిన ప్రసిద్ధ జ్యోతిష్కురాలు బాబా వెంగా చేసిన జోస్యం మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే గతంలోనూ బాబా వెంగా జోస్యాలు నిజం కావడంతో.. తాజాగా నగదు సంక్షోభం, కాగితపు కరెన్సీ విలువ భారీగా పడిపోవడం గురించి చేసిన జోస్యం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయ. భవిష్యత్తులో ప్రపంచం డిజిటల్ లావాదేవీల వైపు పూర్తిగా మళ్లి, నోట్లు,నాణేలు పిచ్చి కాగితాలు అవుతాయంటూ బాబా వెంగా జోస్యం చెప్పింది. కాగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న ఆర్థిక మార్పులు ఈ జోస్యాన్ని నిజం చేసేలా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగడం, వడ్డీ రేట్ల మార్పులు, యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి కారణాలతో ఆర్థిక అనిశ్చితి ఎక్కువైంది. అనేక దేశాల్లో కరెన్సీ విలువ ఒడిదుడుకులకు గురవుతోంది. కొన్ని దేశాల్లో నోట్లు చెల్లుబాటు కాకుండా పోయిన సందర్భాలు, బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం తగ్గిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో కాగితపు కరెన్సీ భవిష్యత్తుపై సందేహాలు పెరుగుతున్నాయి. డిజిటల్ కరెన్సీలు, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) వంటి కొత్త విధానాలు వేగంగా అమల్లోకి వస్తున్నాయి.

ఇలాంటి అస్థిర పరిస్థితుల్లో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. అందులో ముఖ్యంగా బంగారం, వెండి వంటి విలువైన లోహాలకు డిమాండ్ పెరుగుతోంది. చరిత్రలో ఎన్నో ఆర్థిక సంక్షోభాల సమయంలో కూడా బంగారం తన విలువను నిలబెట్టుకుంది. అందుకే అనిశ్చితి పెరిగినప్పుడల్లా ప్రజలు, పెట్టుబడి సంస్థలు బంగారాన్ని నమ్మదగిన ఆస్తిగా చూస్తాయి. వెండి కూడా పారిశ్రామిక అవసరాలు, పెట్టుబడి కోణంలో ప్రాధాన్యం పొందుతోంది. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. మధ్యలో కొంత దిద్దుబాటు జరిగినప్పటికీ, మళ్లీ ధరలు పుంజుకోవడం గమనార్హం. ఇది పెట్టుబడిదారులలో ఉన్న భయం, భవిష్యత్తుపై అనిశ్చితిని స్పష్టంగా చూపిస్తోంది. కాగితపు కరెన్సీపై నమ్మకం తగ్గుతున్న కొద్దీ, భౌతిక ఆస్తులైన లోహాల వైపు ఆసక్తి పెరుగుతోంది.

ఇక నగదు సంక్షోభంపై బాబా వెంగా చెప్పిన జోస్యం నిజమవుతుందా లేదా అన్నది కాలమే తేల్చాలి. కానీ ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులు మాత్రం ప్రపంచం ఒక పెద్ద మార్పు దశలో ఉందని సూచిస్తున్నాయి. డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్నాయి. కరెన్సీ వ్యవస్థలు మారుతున్నాయి. అదే సమయంలో బంగారం, వెండి వంటి సంప్రదాయ పెట్టుబడులు మళ్లీ కీలకంగా మారుతున్నాయి. ఇది భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ ఎలా రూపాంతరం చెందుతుందో సూచించే సంకేతంగా చాలామంది భావిస్తున్నారు.

Next Story