- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బడ్జెట్ హల్వా వేడుక.. అధికారుల లాక్-ఇన్
కేంద్ర బడ్జెట్ కు రంగం సిద్ధం అవుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర బడ్జెట్ కు రంగం సిద్ధం అవుతోంది. ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ 2026–27కు సంబంధించిన పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా నార్త్ బ్లాక్‌లో ప్రతి సంవత్సరం సంప్రదాయంగా నిర్వహించే హల్వా వేడుకను మంగళవారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ ఆర్థిక మంత్రి పంకజ్ చౌధరీతో పాటు ఆర్థిక శాఖకు చెందిన అన్ని విభాగాల కార్యదర్శులు, బడ్జెట్ రూపకల్పనలో కీలకంగా పనిచేసిన అధికారులు పాల్గొన్నారు. హల్వా వేడుక అనంతరం నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రెస్‌ను పర్యవేక్షించారు. నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.
ఇక హల్వా వేడుక మొదలైన నేపథ్యంలో అధికారుల బడ్జెట్ లాక్-ఇన్ ప్రారంభమైంది. అంటే బడ్జెట్ తయారీలో ప్రత్యక్షంగా పాల్గొనే 70 మంది అధికారులు, సిబ్బంది బడ్జెట్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి, నిర్మలా సీతారామన్ ప్రసంగం పూర్తయ్యే వరకు నార్త్ బ్లాక్‌లోనే ఉంటారు. వారు బయటకు వెళ్లడానికి, ఫోన్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. సీసీటీవీ కెమెరాలు, భద్రతా సిబ్బంది నిఘాలోనే పనిచేస్తారు. అయితే 1950లో బడ్జెట్ ముద్రణ సమయంలోనే లీక్ కావడంతో అప్పటి నుంచి ఈ లాక్-ఇన్ విధానాన్ని అమలు చేస్తున్నారు.






