ఈ యాప్ ద్వారా రీచార్జ్ ప్లాన్స్‌పై డిస్కౌంట్..

by Web Desk |
ఈ యాప్ ద్వారా రీచార్జ్ ప్లాన్స్‌పై డిస్కౌంట్..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. బీఎస్ఎన్ఎల్ కొద్ది రోజుల క్రితం సెల్ఫ్‌కేర్ మొబైల్ యాప్‌ను తీసుకొచ్చింది. కాకపొతే ఇది చాలా మంది కస్టమర్స్‌కి తెలియదు. ఈ యాప్‌ను ప్రమోషన్ చేసుకొడానికి అలాగే కొత్త కస్టమర్స్‌ను ఆకట్టుకొడానికి ప్రీప్రెయిడ్ ప్లాన్‌పై BSNL 4 శాతం తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

సెల్ఫ్‌కేర్ యాప్‌లో రీచార్జ్ చేసుకొనేవారికి మాత్రమే 4శాతం డిస్కౌంట్‌ను BSNL ఇస్తోంది. అదికూడా యాప్ ద్వారా రూ.201 లేదా అంతకంటే ఎక్కువ రీచార్జ్‌లపై ఈ డిస్కౌంట్ వర్తిస్తోంది. థర్డ్ పార్టీ యాప్స్ (Google Pay, PhonePe, ఇతర మొబైల్ యాప్‌ల) ద్వారా చేసే రీచార్జ్‌లకు ఈ ఆఫర్ వర్తించదు.10 లక్షల మంది బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు ఇప్పటికే సెల్ఫ్ కేర్ యాప్‌ను వాడుతున్నారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలో ఈ యాప్ అందుబాటులో ఉంది.


Next Story

Most Viewed