- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Brutal Murder: నగరం నడిబొడ్డున అమానుషం.. యువతి దారుణ హత్య
హైదరాబాద్ మహా నగరంలో హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ (Hyderabad) మహా నగరంలో హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా ఓ యువతి దారుణ హత్యకు గురైన విషాద ఘటన బోరంబండ (Borabanda)లో చోటుచేసుకుంది. ఓ పబ్‌లో పనిచేసే సమయంలో యువతితో జహీర్ అనే యువకుడికి పరిచయం ఏర్పడింది. అయితే, ఇటీవలే సదరు యువతి మరో పబ్‌లో ఉద్యోగానికి చేరింది. దీంతో తనతో మాట్లాడటం లేదని కక్ష పెంచుకున్న జహీర్ అనుమానంతో యువతి మాట్లాడుదామని పిలిచి హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని ఓ ఇంటి గోడ పక్కనే పడేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు జహీర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ హత్యకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






