- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Brutal Murder: రాష్ట్రంలో మరో ఘోరం.. MRPS రాష్ట్ర నాయకుడి దారుణ హత్య
రాష్ట్ర ఎమ్మార్పీఎస్ నాయకుడు దారుణ హత్యకు గురైన భయానక ఘటన కర్నూలు జిల్లాలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ఎమ్మార్పీఎస్ (MRPS) నాయకుడు దారుణ హత్యకు గురైన భయానక ఘటన కర్నూలు జిల్లాలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎమ్మార్పీఎస్ నాయకుడు రమేశ్ (Ramesh) శుక్రవారం రాత్రి తన స్వగ్రామం బొందిమడుగుల (Bondimadugula)లో భోజనం చేసి రోడ్డుపై వాకింగ్ చేస్తుండగా.. గుర్తు తెలియని దుండగులు పక్కా పథకం ప్రకారం ఆయనపై దాడికి తెగబడ్డారు.
ట్రాక్టర్‌తో ఢీకొట్టి..
ముందుగా తొలుత రమేశ్‌ను ట్రాక్టర్‌తో బలంగా ఢీకొట్టారు. అనంతరం అతడు కింద పడిపోగానే దుండగులు ఆయనపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచి అక్కడి నుంచి పరారయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న రమేశ్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం కర్నూలులోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే పరిస్థితి విషమించడంతో అతడు చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. రమేశ్ మరణవార్త తెలియడంతో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఈ హత్య వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా లేక పాత కక్షలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.






