- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ బీఆర్‌ఎస్ కైవసం.. చైర్మన్‌గా సంధ్యారాణి
క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ జెండా! చైర్మన్‌గా సంధ్యారాణి, వైస్ చైర్మన్‌గా సీపీఐ నేత సరిత ఎన్నిక.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరిగి ఫలితాల అనంతరం అన్ని పురపాలక సంఘాల్లో పాలక వర్గాలు ఏర్పడి పాలన సాగిస్తున్నాయి. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి రెండు పురపాలక సంఘాల చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో తీవ్ర వివాదాలు, గొడవాలు జరగడంతో.. మున్సిపల్ పాలక వర్గాల ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. ఎట్టకేలకు రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పెండింగ్‌లో మంచిర్యాల జిల్లా క్యాతన్ పల్లి పురపాలక సంఘాల చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు నేడు జరిగాయి.
పోలీసుల పటిష్ఠ బందోబస్తు నడుమఈ ఎన్నిక జరగడంతో మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ బీఆర్‌ఎస్ కైవసం చేసుకొగా.. చైర్మన్‌గా బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్ సంధ్యారాణి ఎన్నికయ్యారు. అలాగే వైస్ చైర్మన్‌గా సీపీఐ పార్టీకి చెందిన సరిత ఎన్నికైనట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే మొదటి నుంచి క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ కైవసం చేసుకొవాలని విశ్వప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు చివరి నిమిషయంలో చైర్మన్ ఎన్నికకు దూరం ఉంటున్నట్లు ప్రకటించారు. దీంతో క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పాలక వర్గం ఎన్నికకు మార్గం సుగుమం అయింది.






