- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sircilla Municipality: సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ భారీ విజయం
సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ విజయకేతనం! మొత్తం 39 వార్డులకు గాను 27 వార్డులను గెలుచుకుని విపక్షాలకు షాక్ ఇచ్చిన కేటీఆర్ సేన. కాంగ్రెస్ 6, బీజేపీ 5 స్థానాలకే పరిమితవ్వడంతో మరోసారి సిరిసిల్ల గడ్డపై గులాబీ హవా కొనసాగింది.

దిశ, వెబ్ డెస్క్: మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో సిరిసిల్ల(Sircilla Municipal) కేంద్రంలో బీఆర్ఎస్ భారీ విజయం సాధించింది. మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి, కేటీఆర్ కు అండగా నిలుస్తున్న ఓటర్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చి అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించారు. సిరిసిల్లలో మొత్తం 39 వార్డులకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 27 స్థానాలను కైవసం చేసుకుని భారీ మెజారిటీతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్ 6 స్థానాలకు, బీజేపీ 5 స్థానాలకు పరిమితం కాగా, ఒక చోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఫలితాలు వెలువడుతున్న కొద్దీ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది, గులాబీ రంగుతో సిరిసిల్ల పట్టణం మెరిసిపోయింది.
ఈ విజయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు రాజకీయంగా మరింత బలాన్ని చేకూర్చింది. తన సొంత నియోజకవర్గ కేంద్రం కావడంతో, అభివృద్ధి పనులే పునాదిగా కేటీఆర్ వేసిన వ్యూహాలు ఇక్కడ అద్భుతంగా పని చేశాయి. సిరిసిల్ల పట్టణాన్ని మోడల్ సిటీ గా మార్చడం, నేతన్నల సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు ఓటర్లను ఆకట్టుకున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఫలితంతో సిరిసిల్ల తన అజేయమైన కంచుకోట అని కేటీఆర్ మరోసారి రాష్ట్ర రాజకీయ యవనికపై చాటిచెప్పారు.






