BRS సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అరెస్ట్

by Muthe.Rajitha |

BRS సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ను గురువారం రాత్రి కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేసారు.

BRS సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : BRS సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ను గురువారం రాత్రి కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేసారు. మారేడ్‌పల్లిలోని క్రిశాంక్ నివాసానికి చేరుకున్న పోలీసులు, ఆయనను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర మంత్రి సీతక్కపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారనే ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా గత కొన్ని రోజులుగా అంగన్‌వాడీలకు పంపిణీ చేసే మొబైల్ ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ క్రిశాంక్ వరుస పోస్టులు చేస్తూ వస్తున్నారు. మంత్రి సీతక్క లక్ష్యంగా ఆయన చేసిన ఈ 'డిఫమేటరీ' ఆరోపణలపై అధికార వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది.

ప్రభుత్వ పథకాలను తప్పుదోవ పట్టించేలా, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని సీతక్క అనుచరులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు క్రిశాంక్ అరెస్టును బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత అరెస్టు అని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారి గొంతు నొక్కడమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని వారు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు క్రిశాంక్‌ను విచారిస్తున్నారు.

Next Story