కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు

by Jakkula.Mamatha |

మాజీ మంత్రి కేటీఆర్‌కు జడ్చర్ల పట్టణంలోని ఫ్లైఓవర్ వద్ద జడ్చర్ల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు
X

దిశ, జడ్చర్ల: ఇటీవల జరిగిన స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన మహబూబ్‌నగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నూతన సర్పంచులు, ఉప సర్పంచ్, వార్డు నెంబర్ల సన్మాన కార్యక్రమానికి వస్తున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్‌కు జడ్చర్ల పట్టణంలోని ఫ్లైఓవర్ వద్ద జడ్చర్ల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. భారీగా బీఆర్ఎస్ శ్రేణులు తరలి రావడంతో కేటీఆర్ ఫ్లైఓవర్ వద్ద ఒక్క నిమిషం ఆగి కార్యకర్తలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు మాజీ మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి శ్రీనివాస్ గౌడ్ కు పుల వర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. కేటీఆర్ సీఎం, సీఎం అంటూ బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. ఈ సందర్భంగా కేటీఆర్ తో కరచాలనం సెల్ఫీ దిగేందుకు బీఆర్ఎస్ శ్రేణులు పోటీపడ్డారు. అనంతరం కేటీఆర్ వాహన శ్రేణి వెంబడి భారీ బైక్ ర్యాలీతో జిల్లా కేంద్రంలో జరిగే సన్మాన సభకు బీఆర్ఎస్ శ్రేణులు తరలి వెళ్లారు.

Next Story