- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేవంత్‌కు త్వరలో సంఘ బహిష్కరణ తప్పదు: MLC Dasoju Sravan Kumar
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సీరియస్ కామెంట్స్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న రౌడీ రేవంత్‌రెడ్డి అని.. ఆయన త్వరలో సంఘ బహిష్కరణ తప్పదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంస్కారం లేని నోరు.. అధికారం ఇచ్చిన మదం ఆయనదని.. రాజకీయ శిక్ష తప్పదని హెచ్చరించారు. దోపిడీ దొంగల జాతి ఆయనదని.. తెలంగాణ ద్రోహి అని విరుచుకుపడ్డారు. మనిషిని మనిషిగా గౌరవించలేని ఆయన అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 72 ఏళ్ల వయసున్న తండ్రిలాంటి రాజ్యంగ హోదా కలిగిన ప్రతిపక్ష నాయకుడికి, సాటి మనిషికిచ్చే కనీస గౌరవం కూడా ఇవ్వకపోవడం చట్టపరంగా నేరమని పేర్కొన్నారు. కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి, హార్వర్డ్ యూనివర్సిటీలో నేర్చున్నది చింతపండు బూతు భాషేనా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమనాయకుడు, రాష్ట్ర సాధకుడు కేసీఆర్‌ను ఒక కులానికి పరిమితం చేయాలని చూడటం తెలంగాణ అస్తిత్వానికే చేస్తున్న విద్రోహమని హెచ్చరించారు. కేవలం ఓట్ల కోసం కుల ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్న రేవంత్ తీరు క్షమించరాని నేరమని.. ఈ కుల అహంకారానికి ప్రజలే త్వరలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు.






