- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు మీరు చూశారా?
గురిగింజ కింద నలుపు తెలియనట్లు బండి సంజయ్ అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: గురిగింజ కింద నలుపు తెలియనట్లు బండి సంజయ్ అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసు పాల్త్ కేసు అని చిన్న పిల్లోడికీ అర్థమైందని.. దావోసు నుంచి రేవంత్‌రెడ్డి చెప్పినట్లు, బండి సంజయ్ వ్యాఖ్యల్లో అర్థమవుతున్నదని అన్నారు. సిరిసిల్లలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సంజయ్ ఏమైనా చూశారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తున్నదని స్వయంగా మోదీ అంటుంటే.. బండి సంజయ్‌కి చెవులు వినపడటం లేదా అని నిలదీశారు. సంజయ్ చిల్లర రాజకీయం గురించి మోడీ తెలుసుకుంటే మంచిదని సూచించారు. ఫామ్‌హౌస్‌కు ఏఐసీసీ నిధులు పోతున్నాయని బండి సంజయ్ అంటున్నారని.. ఆయన ఫామ్‌హౌస్ వద్ద పడుకొని చూస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రిగా ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకైనా అర్థమవుతున్నదా అని ప్రశ్నించారు.






