TG: కాంగ్రెస్ కోఆర్డినేటర్ల జాబితాలో అరికేపూడి గాంధీ పేరు

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-05 16:58:06  IST  )

మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ కోఆర్డినేటర్లను నియమించింది.

TG: కాంగ్రెస్ కోఆర్డినేటర్ల జాబితాలో అరికేపూడి గాంధీ పేరు
X

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ కోఆర్డినేటర్లను నియమించింది. మొత్తం 28 మందితో గురువారం సాయంత్రం జాబితా విడుదల చేసింది. నిజామాబాద్ కార్పొరేషన్‌కు నలుగురిని ఎంపిక చేసింది. అందులో సీనియర్ నేత టి.జీవన్ రెడ్డి, అరికేపూడి గాంధీ, బల్మూరి వెంకట్, ఈరవత్రి అనిల్ కుమార్‌లను నియమించింది. అయితే.. ఇందులో శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ పేరు ఉండటం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే అరికేపూడి గాంధీని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా నిర్ధారించారు. అయితే కాంగ్రెస్ కోఆర్డినేటర్ల జాబితాలో అరికేపూడి గాంధీ పేరు ఉండటంపై బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో అని ఆసక్తి నెలకొంది.

రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల పరిధిలో ఫిబ్రవరి 11న ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. ఆ తర్వాత 13న ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మహిళా ఓటర్లు 26.80 లక్షలు, పురుష ఓటర్లు 25.62 లక్షలు, ఇతరులు 640 మంది ఉన్నారు. ప్రజాస్వామ్యంలో తమకు నచ్చిన వ్యక్తులను ఓటు ద్వారా ఎన్నుకునేందుకు చట్టం కల్పించిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.




Next Story