- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM రేవంత్ టూర్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ
by Gantepaka Srikanth |
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో గులాబీ పార్టీ ఎమ్మెల్యే పాల్గొనడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.

X
దిశ, నిర్మల్ ప్రతినిధి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో గులాబీ పార్టీ ఎమ్మెల్యే పాల్గొనడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి ఆదిలాబాద్ పర్యటనకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ అధిష్టానం అంతర్గతంగా సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. కానీ అనూహ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరు కావడం హాట్ టాపిక్‌గా మారింది.
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన సదర్ మాట్ ప్రాజెక్ట్ ద్వారా జగిత్యాల జిల్లాలోని కోరుట్ల నియోజకవర్గానికి సైతం సాగునీరు అందనుంది. దీంతో భూసేకరణ నిధులతో పాటు కాలువల నిర్మాణం గురించి మంత్రి ఉత్తమ్, సీఎం రేవంత్‌ను కలిశారని చెబుతున్నారు. కాగా ఈ వ్యవహారం గులాబీ పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నది.
Next Story






