- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ ముమ్మాటికీ జాతిపితనే: MLC
రేవంత్‌ది కుక్క తోక వంకర అనే బుద్ధి అని.. హార్వర్డ్ వెళ్లినా అంతరిక్షం వెళ్లినా ఆయన బుద్ధి మారదని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రేవంత్‌ది కుక్క తోక వంకర అనే బుద్ధి అని.. హార్వర్డ్ వెళ్లినా అంతరిక్షం వెళ్లినా ఆయన బుద్ధి మారదని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. గ్యారంటీల అమలు వదిలి గారడీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని అన్నారు. కేసీఆర్ ముమ్మాటికీ జాతిపితనే అని.. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన చరిత్ర ఆయనది అని.. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్‌రెడ్డిది చీమ కాలంత ప్రమేయం కూడా లేదని చెప్పారు. కేసీఆర్‌నుద్దేశించి చేసిన వెకిలి మాటలను ఖండిస్తున్నట్లు తెలిపారు. సీఎం మాటలు సిట్ విచారణను ప్రభావితం చేసేలా ఉన్నాయని.. కేసీఆర్ ఏనాడూ విచారణను ఎదుర్కోను అని అనలేదని తెలిపారు.
కేవలం మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున మొదటి నోటీసు విచారణకు టైమ్ కోరారని.. రెండేళ్లలో ఎన్నో విచారణలను ఎదుర్కొన్నామని.. దేనికి భయపడబోమని చెప్పారు. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి విద్వేష పూరిత ప్రసంగాలు వద్దని సూచించినా దాన్ని పెడచెవిన పెట్టి రేవంత్ కేసీఆర్‌పై దిగజారుడు వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. సమ్మక్క-సారలమ్మ జాతర నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. జాతర నిర్వహణకు శాశ్వత ఏర్పాట్లు చేస్తామని సీఎం, మంత్రులు ఉత్తర కుమార ప్రగాల్భాలు పలికారని.. 15 గంటలపాటు ట్రాఫిక్ జామ్ అయ్యిందని.. ఇదొక్క వైఫల్యం చాలు రేవంత్ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తున్నదో చెప్పడానికి అని అన్నారు. మాటలు తప్ప ఈ ప్రభుత్వంలో చేతలు లేవని.. జాతరకు వచ్చిన భక్తులకు ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.






