- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రేవంత్‌పై కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నేత జీవన్‌రెడ్డి ఫిర్యాదు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జీవన్‌రెడ్డి సోమవారం జగిత్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

దిశ, జగిత్యాల ప్రతినిధి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జీవన్‌రెడ్డి సోమవారం జగిత్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందజేయడానికి ముందస్తుగా సమాచారం ఇచ్చినా ఇన్‌స్పెక్టర్ అందుబాటులో లేకపోవడంతో జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కొంతసేపు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం ఇన్‌స్పెక్టర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకోగా, ఆయనకు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. జూలై 11న జరిగిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో విద్వేషం, హింసను ప్రేరేపించేలా ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ప్రతిపక్ష నాయకులపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని ఆరోపిస్తూ, ఈ అంశంపై వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత, బీఆర్ఎస్ నాయకులు సురేష్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.






