జగదీష్ రెడ్డికి అనారోగ్యం.. ఆసుపత్రికి చేరుకున్న గులాబీ నేతలు

by Muthe.Rajitha |   (  Updated:2026-01-22 22:48:43  IST  )

BRS కీలక నేత, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు.

జగదీష్ రెడ్డికి అనారోగ్యం.. ఆసుపత్రికి చేరుకున్న గులాబీ నేతలు
X

దిశ, వెబ్ డెస్క్ : BRS కీలక నేత, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే జగదీష్ రెడ్డి స్వల్ప అస్వస్థత చెందారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలియజేసారు. కాగా విషయం తెలుసుకున్న గులాబీ నేతలంతా హాస్పిటల్ కి చేరుకున్నారు. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే డా. గాదరి కిషోర్ కుమార్ ఆసుపత్రిలో జగదీష్ రెడ్డిని పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ డాక్టర్లతో మాట్లాడి చికిత్స వివరాలు తెలుసుకోగా.. జగదీష్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక జగదీష్ రెడ్డి అనారోగ్యం గురించి తెలుసుకున్న BRS కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Next Story